ప్రకటన

2 - వారాల శిక్షణ కార్యక్రమాలు (ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్)

దరఖాస్తు ఫారం (డౌన్‌లోడ్ చేసుకొని పూరించండి)
 
జాఅస దృష్టి కేంద్రీకరించిన అంశాలలో ఒకటి అనువాదకుల నైపుణ్య అభివృద్ధి. సమితి ఇంటెన్సివ్ ప్రోగ్రామ్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ల రూపంలో అనువాదకులకు శిక్షణను ఇస్తుంది. ఇది వృత్తిపరమైన అనువాదకులకు విద్యా సహాయాన్ని కూడా అందిస్తుంది. అనువాదంలో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులను అందించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.

2 - వారాల శిక్షణ కార్యక్రమాలు (ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్)

ఎవరు హాజరు కావచ్చు? ఒక అభిరుచిగా అనువదించేవారికి లేదా అనువాదకులుగా తమ ఉద్యోగితను నిర్మించుకోవాలకునే వారికి ఈ కార్యక్రమం. జ్ఞానాన్ని పెంచుకొని, నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకునే వృత్తినిపుణ అనువాదకులకు, అనువాద అధ్యయన విద్యార్థుల కోసం కూడా. నమోదు చేసుకొని పాల్గొనేవారిలో సాధారణంగా (ఎ) అనువాదాన్నివృత్తిగా చేపట్టిన ప్రారంభ ఉద్యోగులు, వివిధ విశ్వవిద్యాలయాలు/సంస్థలలో నమోదు చేసుకున్న విద్యార్థులు, (బి) వివిధ ప్రభుత్వ, పాక్షిక (సెమీ) ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే భాషా అధికారులకు, (సి) సిఎస్‌టిటి కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులు మొదలైనవారికి.

ఎక్కడ? శిక్షణ, ఓరియంటేషన్ కార్యక్రమాలు మైసూరు లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ లోని జాతీయ అనువాద సమితిలో జరుగుతాయి. అతిథేయిసంస్థలతో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇతర ప్రదేశాలలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి.

 
ఫీజు: కోర్సు ఫీజు వంటివి ఏమీ లేవు. అయితే, ఈ కార్యక్రమం పాల్గొనేవారు ప్రారంభంలో రూ .500 / - మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బును ట్రాన్స్లేషన్ టుడే జర్నల్ ఒక సంవత్సరం చందాకు సర్దుబాటు చేయటం జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి? ఆసక్తిగల వ్యక్తులు www.ciil.org / www.ntm.org.in ప్రకటనల విభాగం నుండి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని పూరించి, సంతకం చేసిన దరఖాస్తుతోపాటుగా సంబంధిత ధృవీకరణ పత్రాలను, యోగ్యతాపత్రాల కాపీలను జతపర్చి ఈ కింది చిరునామాకు పంపించాలి.
  The Project Director,
National Translation Mission
Central Institute of Indian Languages,
Manasagangotri, Hunsur Road,
Mysore, Karnataka 570006.

శిక్షణనిచ్చేది ఎవరు? ఈ రంగంలో నిపుణులయిన శిక్షణదారుల సమూహం జాఅసలో ఉంది. శిక్షణదారులలో కొంతమంది జాఅస, సిఐఐఎల్ లో అంతర్గత వనరు వ్యక్తులుగా పనిచేస్తున్నారు, మరికొంతమంది వివిధ సంస్థల నుండి సేవలందిస్తున్నారు గమనిక: ఏడాది పొడవునా దరఖాస్తులు అంగీకరించబడతాయి. దరఖాస్తు కవర్‌కు ఎడమ చేతి ఎగువ మూల పైన 'జాఅస అనువాద శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తు' అని రాయాలి. సేవలో ఉన్నవారు లేదా ఏదైనా క్రమానుగత నియమితపని లోఉన్నవారు తమ యజమాని లేదా సంస్థ అధిపతి (అనుమతితో) ద్వారా దరఖాస్తులను పంపాలి. ఎంపికైన అభ్యర్థుల పేర్లు సిఐఐఎల్, జాఅస వెబ్‌సైట్‌లో పెట్టటం జరుగుతుంది.

సంప్రదింపు స్థానం: దయచేసి అన్ని ప్రశ్నలను ntmtrainingprog2016[at]gmail[dot]com కు పంపండి.