|
సాఫ్ట్ వేర్
సాపేక్షికంగా తక్కువ ధరలోనే, త్వరితగతిన అధిక పరిమాణంలో అనువాదం చేసే కొత్త అవకాశాలను,
కొత్త సాంకేతజ్ఞతలు అందిస్తున్నాయి. యంత్ర సహాయక అనువాదాన్ని అభివృద్ధి చేయటానికి వివిధ
సంస్థలు నిమగ్నమయి ఉన్నాయి.
సి-డ్యాక్, టిడిఐఎల్, ఐఐటిలు మొ. వాటి వంటివి చేసే ప్రయత్నాలను జాఅస పునరుక్తం చేయదు.
ఇప్పటికే ప్రభుత్వం వీటికి భారీ నిధులు ఇచ్చేసింది. ఏదియేమైనప్పటికీ, యంత్రానువాదంలో
ఇది సాంకేతజ్ఞతాభివృద్ది విధానాలకు సౌకర్యకారిగా ఉండి, శిక్షణ, మానవ వనరుల అభివృద్ధి,
సంయుక్త కార్యకలాపాలతో ఇతరులకు సహాయపడే యోగవాహకంగా ఉపయోగపడుతుంది.
జాఅస “ఇన్-ల్యాన్”- ఒక (రూల్ బేస్డ్ - వ్యాకరణ సూత్ర ఆధారిత) ఇంగ్లీష్ కన్నడ యంత్రానువాద
ప్యాకేజీ. దీని ముఖ్యోద్దేశం: ఇచ్చిన ఇంగ్లీష్ వాక్యాలకి యాంత్రికంగా కన్నడ అనువాదం
చేయడం.
|
»
|
అత్యంత సమర్ధవంతంగానూ ప్రభావితపూర్వకంగానూ అనువాదం చేయడానికి అవసరమైన సత్వర అనువర్తనకు
ఉపకరించే ఆన్ లైన్ ట్రాన్స్లేషన్ మెమరీ ఉపకరణాలు, పర్యాయపదకోశాలు, ద్విభాషా నిఘంటువుల
వంటి ప్రత్యేక డిజిటల్ ఉపకరణాల అవస్థాపనల సృష్టి.
|
|
»
|
ఇ-నిఘంటువులు, వార్డ్ నెట్లు (పదజాలికలు), భాషా విశ్లేషణ, సమన్వయ ఉపకరణాలు, పద సందర్భ
ఉదాహరణలు, పౌన:పున్య విశ్లేషణిలు వంటి పద వనరుల సంపద యంత్రానువాద వ్యవస్థకు అవసరమైన
విభాగాలు. ఇవి అన్నీ ఏ ఒక్క సంస్థనో సృష్టించి నిర్వహించేది కాదు. దీనికి, దీర్ఘకాలంతోపాటు
బహు సంస్థల తోడ్పాటు అవసరం ఉంటుంది. ఇలాంటి బృందకార్యకలాపానికి నిరంతరం జరిగే ఆన్ లైన్
చర్చలకు, సమావేశాలకు జా అస వేదికను ఏర్పాటు చేస్తుంది.
|
|
»
|
జాఅస అనువాదం చేయడానికి ఎంపికచేసుకున్న పుస్తకాలను వాటి అనువాదాలను కూడా సాధ్యమైనంత
వరకు పూర్తిగా డిజిటల్ రూపంలో మార్చి అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రామాణికమైన ఎక్స్
ఎమ్ఎల్ ట్యాగ్స్ మరియు డిటిడిలతో డిజిటల్ రూపంలో ఉన్న ఈ సంపద ఒక ప్రామాణిక రూపంలో ఉండేలా
జాఅస చూడాలి.
|
|
»
|
వివరణాత్మకమైన సమలేఖనాలతో ఉన్న గుణవత్తరమైన సమాంతర పాఠ్య సంకలనాలు తయారుచేయడం - నేటి
అంతర్జాతీయ ధోరణి. అలాంటి సమలేఖనాలతో ఉన్న పాఠ్య సంకలనాలను యంత్ర అభ్యాసక సాంకేతిక
మర్మాలతో ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా యంత్రానువాద వ్యవస్థలను పొందవచ్చు. ఇంత
పెద్దమొత్తంలో ఉన్న సమాచారానికి మరియు చేసే ప్రయత్న తీవ్రతకు గణనీయమైన పరిమాణంలో ఆరంభిక
పెట్టుబడులు అవసరం. అది ఏ ఒక్క వైయక్తిక సంస్థవల్లో జరిగే పని కాదు; ఏదియేమైనప్పటికి
ఇటువంటి ప్రయత్నాలకు జాఅస కొంత సహాయాన్ని అందజేస్తుంది.
|
|
|
|