చేపట్టిన అనువాద కార్యకలాపాలు (ఎసైన్మెంట్స్)

దేశ వ్యాప్త ప్రచురణకర్తల సహకారంతో జాఅస భారతీయ భాషలలో అనువాదాలను అచ్చు వేస్తుంది. ఈ ప్రచురణకర్తలు ఎంపిక చేసుకున్న ఆయా పుస్తకాల రచనా స్వామ్య హక్కులు గలవారైనా అయి ఉండాలి లేదా భారత దేశంలో వేరువేరు ప్రాంతాలలో ఉన్న భారతీయ భాషలలో ప్రచురణకర్తలైనా అయి ఉండాలి. అలాంటి ప్రచురణకర్తలతో అనువాద పుస్తకాల క్రయ విక్రయాలలోనూ పంపిణీ విషయాలలోనూ చేయి చేయీ కలిపి జాఅస పని చేస్తుంది.

జాఅస అనువాదాలు చేయించడానికి రెండు రకాల తాత్కాలిక విధానాలను అనుసరిస్తుంది. అవి:

  » మూల ప్రచురణకర్తలు తమంతటతామే అనువాదం చేసి అచ్చువేసే పద్ధతి. జాఅస కొంతమేరకు ఖర్చును భరించటం ద్వారానో లేదా నిపుణులను సమకూర్చటం వంటి ఏర్పాటు చేయడం ద్వారానో పాక్షికంగా ఈ విధానంలో పాల్గొంటుంది.
  » మూల ప్రచురణకర్త అనువాదం చేయించటానికి ఆసక్తి చూపించనట్లైతే జాఅస బయటి వనరుల(ఔట్ సోర్స్) ద్వారా అనువాదం, ప్రచురణ పంపిణీలను భారతీయ భాషలలో చేయిస్తుంది. ప్రత్యేకంగా ఆ అనువాదానికి హక్కులన్ని జాఅస సొంతం. రచనాస్వామ్య హక్కులుగల వారు యాజమాన్య రుసుం పొందుతారు. భారతీయ భాషల ప్రచురణకర్తల విషయంలో పుస్తకాన్ని అనువాదం చేయించలేనట్లైతే, జాఅస అనువాదం చేయించటంతోపాటు ముద్రణ ప్రతిని సిద్ధంచేసి భారతీయ భాషల ప్రచురణకర్తలకు పంపిస్తుంది. ప్రచురణకర్తలు అనువాద పుస్తకాల క్రయ విక్రయాలతోపాటు పంపిణీ బాధ్యతలను కూడా తీసుకుంటారు.

తరువాతది, టర్నీకీ పద్దతి (ప్రచురణ కర్తలే అన్నిబాధ్యతలను తీసుకోవడం).