|
ఉపయుక్తగ్రంథసూచి సమాచారనిధి
ఆదేశం
|
భారతదేశంలోని అన్ని అనువాదసంబంధితకార్యకలాపాలకు ఒక క్లియరింగ్ హౌస్ గా మారుతుంది
|
సమాచారనిధికి సమాచారాన్నిచ్చి నివిష్ఠాల రూపకల్పనకు సహాయపడిన ఆచార్య. జి. ఎన్ దేవి
(భాషా సంశోధన కేంద్రం, వదోదర.)గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
|
ఎందుకు ఉపయుక్త గ్రంథసూచి కావాలి ?
|
ఉపయుక్తగ్రంథసూచి పుస్తకాల వివరణతోపాటు ఒక శాస్త్రీయ అధ్యయనం. ఇది ఒక విషయం లేదా భాష
లేదా కాలం వంటి సాధారణ అంశాలను పంచుకునే శీర్షికల (పేర్ల) జాబితా. ఈ జాబితా స్వభావంలో
సమగ్రంగానూ లేదా ఎంపిక చేసుకున్నదైనా అవ్వవచ్చు.
|
ఉపయుక్తగ్రంథసూచి ప్రయోజనమేమిటంటే ఒక అంశం పై ఉన్న విషయ సామగ్రి సమాచార నిర్వహణకు ఉపయోగపడుతుంది.
తద్వారా జ్ఞానం పొందుకోవలనుకునే వారికి దాని ప్రవేశ సౌలభ్యం ఉంటుంది. అవి ఒక ఉత్పాదక
లేక ఒక సమాచారానికి సంబంధించిన కార్యకలాపాలు. కనుక మరో రకంగా ఉపయుక్త గ్రంథసూచి ఆ పుస్తక
చరిత్రను మనకు తెలియజేస్తుంది.
అనువాద ఉపయుక్తగ్రంథసూచి సమాచారనిధి అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ
క్లిక్ చేయండి.
|
|
|
వనరులు:
|
|
»
|
అనుకృతి (సిఐఐఎల్ – సాహిత్య అకాడెమి మరియు ఎన్బిటి)
|
|
»
|
భాషా సంశోధన కేంద్ర, వదోదర
|
|
»
|
బ్రిటీషు గ్రంథాలయంవారి ప్రాచ్య మరియు భారతీయ కార్యాలయ – సేకరణ
|
|
»
|
వివిధ ప్రచురణకర్తల పుస్తక పట్టికలు
|
|
»
|
కేంద్ర సంప్రదింపు గ్రంథాలయం – కొలకత్తా
|
|
»
|
భారత సాహిత్య జాతీయ ఉపయుక్త గ్రంథసూచి (ఎన్బిఐఎల్)
|
|
»
|
సౌత్ ఏషియన్ యూనియన్ కాటలాగ్ (యూనివర్సిటీ ఆఫ్ చికాగో లైబ్రరీస్ సౌత్ ఏషియన్ డిపార్ట్మెంట్
|
|
»
|
యునెస్కో
|
|
»
|
యూనివర్సిటీ ఆఫ్ ఇలియన్స్, అర్బనా – చాంపేన్, జాఅస ప్రస్తుతం మరింత సమాచారాన్ని అనేక
వనరులద్వారా సేకరిస్తుంది. దీన్ని డిజిటైజ్ చేసి (సంగ్రణీకరించి) సమాచార నిధిలో కలుపుతుంది.
|
|
ఉపయుక్తగ్రంథసూచి శైలులు
|
ఉపయుక్తగ్రంథసూచి శైలను సంబంధించినంతవరకు రకరకాల వనరులకు రకరకాల నమూనాలు (ఫార్మెట్స్)
ఉన్నాయి.
సాధారణంగా వీటికి ఉపయోగించే రెండుమార్గదర్శక నమూనాలు ఉన్నాయి. అవి: ఎమ్ఎల్ఏ (మోడరన్
లాంగ్వేజ్ అసోషియేషన్) మరియు ఏపిఏ (అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్) పరిశోధనా వనరులను
ఉటంకించే సందర్భంలో వివిధ రకాల అంశాలకు ఉపయుక్తగ్రంథసూచిని తయారు చేసే విషయంలో మోడరన్
లాంగ్వేజ్ అసోసియేషన్ వారి శైలి విస్తృతంగా వాడకంలో ఉంది. జాతీయ అనువాద సమితి కూడా
ఈ శైలినే ఉపయోగిస్తూ దీనితో పాటుగా ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యా విధానాన్ని కలిగి
ఉంది.
|
జాఅస అభివృద్ధి చేస్తున్న ఉపయుక్తగ్రంథసూచి ప్రత్యేక లక్షణాలు.
|
సాహిత్య సాహిత్యేతర ప్రక్రియల రెంటిలోనూ అనువాదం చేసిన పుస్తక శీర్షికలపై దృష్టి పెట్టి
జాఅస ఈ ఉపయుక్తగ్రంథ సూచిని అభివృద్ధి చేస్తుంది. ఇంకా భారత రాజ్యాంగ 8వ షెడ్యూల్డ్
జాబితాలో ఉన్నా లేకపోయినా భారతదేశంలోని అన్ని భాషలో ఉన్న అనువాద శీర్షికలు అన్వేషించి
వాటిని ఉపయుక్త గ్రంథసూచిలో చేరుస్తుంది.
|
అనువాద శీర్షికల సమాచారాన్ని భారతీయ భాషలనుంచి భారతీయ భాషలలోనికి అలాగే భారతీయ భాషల
నుంచి ఇతర భాషలలోనికి సమకూర్చడం కూడా ఈ కార్యక్రమంలో భాగం.
జాఅస ఈ గ్రంథసూచి ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను సూచిస్తుంది. దీనిని ఐఎస్టిఎన్
(ఇండియన్ స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ నంబర్) అంటారు. ఇది భారతీయ భాషలోకి అనువాదం అయిన
పుస్తకాలు సరైన రీతిలో ఉంచడానికి సహాయపడతాయి. పరిశోధకులను/ పరిశోధక విద్యార్థులు/జ్ఞాన
తృష్ణగలవారికి ఇది తప్పనిసరిగా ఒక భాషలో అనువాదాన్ని అనువాదానికి సంబంధించి ఎన్ని పుస్తకాలు
ప్రచురింపబడ్డాయో తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది. కావలసిన భాషలో ఎన్ని పుస్తకాలు అనువాదం
అయినాయి, ఏ విషయానికి సంబంధించి ఒక సంవత్సరంలో మొదలైన అనేక అంశాలు తెలుసుకోవచ్చు.
జాఅస దీనిని వెబ్ ఆధారిత సమాచారనిధిగా వుంచి దీన్ని అనేక మందికి అందుబాటులో ఉంచాలని ఆశిస్తుంది. దీన్ని మెరుగు పరచటానికి కొత్త సమాచారాన్ని చేర్చడానికి వెసులుబాటు కలిగిస్తుంది.
|
ఈ సమాచార నిధిలో లేని అనువాద సమాచార మీ దగ్గర ఏదైనా ఉంటే దానిని చేర్చి జాఅసకి సహాయపడండి .మీరు ఒక ఉపయోగదారు ఖాతాని సృష్టించుకొని మీ జ్ఞప్తిలో ఉన్నన్ని అనువాదాల సమాచారాన్నిచేర్చండి. మీరు ఇంకా
ntmciil@gmail.com సమాచారాన్ని పంపవచ్చు. జాఅస ఆ అనువాద సమాచారాన్ని సమాచార నిధిలో తాజా సమాచారం చేర్చవచ్చు.
|
|
మీరు ప్రచురణకర్తలయితే, ఉపయోగదారుల నివిష్టాలను ఉపయో గించి సమాచారాన్ని చేర్చవచ్చు. సరికొత్త సమాచారాన్ని ఈ సమాచారా నిధిలోనే చేర్చవచ్చు. మీకు ఇంకా మీద దగ్గరున్న సమాచారాన్ని ntmciil@gmail.com పంపవచ్చు. దానిని జాఅస సమాచార నిధిలో తాజా సమాచారాన్ని చేరుస్తుంది.
|
ఉపయుక్తగ్రంథసూచి శోధన
|
భారతీయ భాషలలో అనువాద శీర్షికలకు సంబంధించిన ఏ రకమైన సమాచారానికైనా ఇక్కడ శోధించండి.
|
|
|