ఆశయాలూ ఉద్దేశాలూ

సమితి స్వల్పకాలిక లక్ష్యాలు
  » కాళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో బోధించే అన్ని ప్రధాన విషయాలలో జ్ఞాన పాఠ అనువాదాల ఉన్నతి మరియు ప్రచురణ
  » ఇండియన్ యూనివర్సిటీస్ డేటాబేస్, నేష్నల్ రెజిస్టర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ (ఎన్ ఆర్ టీ), పబ్లిషర్స్ డేటాబేస్, బిబ్లియోగ్రఫీ ఆఫ్ ట్రాన్స్లేషన్స్, ఫ్యాకల్టీ డేటాబేస్/ఎక్స్పర్ట్స్ రిపాజిటరీ, డిక్షనరీస్ అండ్ గ్లాసరీస్ డేటాబేస్ మొదలైన ఐదు సమాచారనిధుల సృష్టి మరియు నిర్వాహణ
  » ఇంగ్లీష్ మరియు భారతీయ భాషలలో మషీన్ ఎయిడడ్ ట్రాన్స్లేషన్ వృద్ధి
  » విభిన్న క్షేత్రాలలో అనువాదకుల ధ్రువీకరణ మరియు శిక్షణ
  » అనువాదక విద్యా కార్యక్రమం కింద స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం
  » నిఘంటువులు, పర్యాయపదకోశాలు లాంటి అనువాద ఉపకరణాలను తయారు చేయడం.
  » భారతీయ భాషలలో శాస్త్రీయ సాంకేతిక శబ్దాల తయారీలో శాస్త్రీయ సాంకేతిక పరిభాషా సంఘం (సీఎస్టీటీ) తో సమన్వయం ఏర్పర్చుకోవడం.

సమితి దీర్ఘకాలిక లక్ష్యాలు:
  » ట్రాన్స్లేషన్ మెమరీ, వార్డ్ ఫైన్డర్స్, వార్డ్ నెట్ మొదలైన సాఫ్ట్ వేర్ల పరిశోధనా అభివృద్ధికి సహాయాన్ని అందించడం.
  » న్యాచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెస్సింగ్ మరియు అనువాదం సంబంధిత పరిశోధన పథకాలకు ఉపకార వేతనాలు, సహాయక నిధులు ప్రతిపాదించడం
  » అనువాదంలో డిగ్రీ/డిప్లొమా కోర్సులు మరియు ప్రత్యేక ప్రాజెక్టులు నిర్వహించేందుకు విశ్వవిద్యాలయాలకు/విభాగాలకు సహాయక నిధులు అందజేయడం
  » అనువాద పత్రికలకు సహాయం అందించడం లేదా భారతీయ భాషలలో అనువాద సంబంధిత పాఠాలు మరియు విశ్లేషణ మొదలైన అంశాలను ప్రచురించడం
  » అనువాదాల పుస్తక ఆవిష్కరణలు, ప్రాదేశిక అనువాద ఉత్సవాలు, చర్చలు, పుస్తక ప్రదర్శనలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనువాదకులకు అవకాశాలు కల్పించి అనువాద కార్యకలాపాలకు తోడ్పడడం
  » అనువాద అధ్యయనాలపైన చెప్పుకోదగ్గ విద్యాసంబంధిత రచనల నిధిని తయారు చేసి, వాటిని చర్చలకు అనుగుణంగా సిద్ధం చేయడం.
  » అనువాదాన్ని ఒక ఆచరణీయ వృత్తిగా స్థాపించి ఒక అనువాద పరిశ్రమగా రూపొందించడం.

లబ్దిదారులు
ఒక విస్తృత జ్ఞాన సమాజం ఏర్పర్చాలన్నది జాఅస లక్ష్యం. ఒక భాష నుంచి మరో భాషలోకి మౌలిక పాఠాలను అనువాదాల ద్వారా అందజేస్తుంది. దీనితోపాటు, సమానమైన జ్ఞాన వ్యాప్తిని పెంపొందించాలని జాఅస ఆశిస్తుంది. దీనికి ప్రతిఫలంగా, భాష అనే అడ్డంకి కారణంగా జ్ఞానాన్ని పొందడంలో ఇబ్బందికి గురయ్యే విద్యార్థులకు ఈ ప్రయత్నం ఎంతగానో తోడ్పడుతుంది. విభిన్న క్షేత్రాలలో ఉన్న అధికసంఖ్యాక ప్రజానికానికి కూడా లబ్ది చేకూర్చాలని జాఅస ఆశిస్తుంది.
  » వివిధ స్థాయిలలో ఉన్న విభిన్న విషయాల బోధకులు
  » రచయితలు/అనువాదకులు/ప్రచురణకర్తలు
  » వివిధ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థల అనువాద అధ్యయనం భాషాశాస్త్ర విభాగాలు మరియు పరిశోధకులు
  » నూతన ఆసక్తికర క్షేత్రాలలో అడుగుపెట్టాలనుకునే భారతీయ భాషల ప్రచురణకర్తలు
  » అనువాద సాఫ్ట్వేరుల రూపకర్తలు
  » తులనాత్మక సాహిత్య అధ్యయనం చేసే విద్యార్థులు
  » సాహిత్య, జ్ఞాన పాఠాలను తమ సొంత భాషలో కావాలనుకునే పాఠకులు
  » అనౌపచారిక విద్యను అందజేసే పనిలో నిమగ్నమైన స్వచ్ఛంద సేవకులు
  » ప్రజా ఆరోగ్యం, పౌరహక్కులు, పర్యావరణం, జనప్రియ శాస్త్ర విజ్ఞానం మొదలైన క్షేత్రాలలో కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు
  » దుబాసిలను కోరే ప్రభుత్వ ప్రభుత్వేతర ఏజన్సీలు, వ్యక్తులు
  » ఉపశీర్షికలు ఇంకా బహుభాషలలో విడుదల చేయాలనుకునే చిత్ర నిర్మాతలు
  » వేరువేరు భాషలలో కార్యక్రమాలను ప్రసారం చెయ్యగోరే ఎఫ్ ఎమ్, ఇంకా ఇతర రేడియో సంస్థలు