|
నిఘంటువులు
నిఘంటువులు, పర్యాయపదకోశాలు వంటి ఉన్నతస్థాయి అనువాద ఉపకరణాల ఉత్పాదన జాఅస ముఖ్య ఉద్దేశాలలో
ఒకటి. 22 భారతీయభాషలలో ద్విభాషా, ఇ-నిఘంటువులు తయారు చేయడం జరుగుతుంది. భాషాప్రయోగాల
విషయంలో ఇది ప్రత్యేకమైనది. సందర్భోచితమైన సహజ వాక్య నిర్మాణాలు, విస్తృత స్థాయి ఉదాహరణలు,
తరచుగా ఉపయోగిస్తున్న నైఘంటుక, ప్రాయోగిక విషయాలు వాటి ప్రయోగాలు దీని విశేషం.
వివిధ భారతీయభాషలలో నిఘంటు నిర్మాణానికి జాఅస కృషి చేస్తుంది. ప్రస్తుతానికి రెండు
రకాల నిఘంటు నిర్మాణ కార్యకలాపాలను చేపట్టింది. అవి:
|
అ) ద్విభాషా ప్రాథమిక నిఘంటువులు
ఆ) ద్విభాషా, ఇ-నిఘంటువులు
|
ద్విభాషా ప్రాథమిక నిఘంటువులు
|
భారతీయభాషల కేంద్రీయ సంస్థ యునైటెడ్ కింగ్డమ్ - లాంగ్మన్ పియర్సన్ గ్రూపు వారి సహభాగస్వామ్యంతో
ద్విభాషా నిఘంటువుల తయారీ 2006వ సంవత్సరం మే -జూన్ నెలల్లో ప్రారంభించింది. జాఅస ప్రారంభించినప్పుడు
నిఘంటువులు అనువాదానికి ఉపకరణాలుగా ఉండాలనేది ఉద్దేశం; 2008వ సంవత్సరంలో ఈ పథకాన్ని
జాఅసలో చేర్చడం జరిగింది. ఈ ద్విభాషా నిఘంటువులు బ్రిటీష్ నేషనల్ కార్పస్ (బి ఎన్ సి)
ఆధారితమై విస్తృత ప్రాచుర్యం పొందిన అత్యంత పౌన:పున్యంగల 14 వేల పదాల ఇంగ్లీష్ ఇంగ్లీష్
ప్రాథమిక నిఘంటువును మాదిరిగా తీసుకొని తయారు చేసినవి.
లాంగ్మన్ – ఎన్ టి ఎమ్ - సిఐఐఎల్ ప్రాథమిక ద్విభాషా నిఘంటువులను దశలవారీగా అచ్చువేయవలసి
ఉంది. బెంగాలీ, హిందీ, మలయాళం, కన్నడ, ఒడియా, తమిళ నిఘంటువులు ఇప్పటికే అచ్చయ్యాయి.
పంజాబీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, ఉర్దూ నిఘంటువులు ముద్రణ దశలో ఉన్నాయి.
|
|
|
పియర్సన్ ఎడ్యుకేషన్ (ఇండియా) 2011 - 2012 లలో ప్రచురించిన నిఘంటువుల జాబితా:
|
|
1.
|
లాంగ్మన్ - సిఐఐఎల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ హిందీ నిఘంటువు
|
|
2.
|
లాంగ్మన్ - సిఐఐఎల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బెంగాలీ నిఘంటువు
|
|
3.
|
లాంగ్మన్ - సిఐఐఎల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కన్నడ నిఘంటువు
|
|
4.
|
లాంగ్మన్ – ఎన్ టి ఎమ్ - సిఐఐఎల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఒడియా నిఘంటువు
|
|
5.
|
లాంగ్మన్ – ఎన్ టి ఎమ్ - సిఐఐఎల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మలయాళం నిఘంటువు
|
|
6.
|
లాంగ్మన్ – ఎన్ టి ఎమ్ - సిఐఐఎల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ తమిళ నిఘంటువు
|
భారత రాజ్యాంగ 8వ అధికరణలో పేర్కొన్న 22 భారతీయ భాషలకు ఈ నిఘంటు నిర్మాణ కార్యకలాపాలను
విస్తృతపరిచే దిశగా జాఅస పని చేస్తుంది.
ద్విభాషా ఇ-నిఘంటువులు:
పియర్సన్ ఎడ్యుకేషన్ వారి ఎక్స్ ఎమ్ ఎల్ డేటాసెట్ - లాంగ్మన్ అడ్వాస్డ్ బైలింగ్వల్
ప్రేమ్ వర్క్ (ఎల్ ఏ బి ఎఫ్) ను ఉపయోగించుకోడానికి, సలహా సేవలు, లైసెన్సు కోసం ఎన్
టి ఎమ్ – సిఐఐఎల్ డోర్లింగ్ కిండర్స్లే (ఇండియా) ప్రై. లి. తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలకు ఎల్ ఏ బి ఎఫ్ డేటాసెట్ ని లాంగ్మన్ యూకే వారు ఎన్ టి ఎమ్
కోసం ఐడిఎమ్ సర్వర్లో అప్లోడ్ చేశారు. డిక్షనరీ ప్రొడక్షన్ సిస్టమ్ (డి.పి.ఎస్) ద్వారా
ఎల్ ఏ బి ఎఫ్ డేటాసెట్ ని ఉపయోగిస్తారు. వాస్తవానికి ఈ ఎల్ ఏ బి ఎఫ్ డేటాసెట్ ని లాంగ్మన్
అభివృద్ధిపరిచింది, విక్రయాలను ఐడిఎమ్, ఫ్రాన్స్ వారు చేశారు. జాఅస ద్విభాషా నిఘంటువులకు ఆధారం :
|
|
»
|
లాంగ్మన్ డిక్షనరీ ఆఫ్ కాంటెంపరరీ ఇంగ్లీష్
|
|
»
|
లాంగ్మన్ అడ్వాన్స్డ్ అమెరికన్ డిక్షనరీ
|
|
»
|
లాంగ్మన్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ కల్చర్
|
|
»
|
లాంగ్మన్ బిజినెస్ డిక్షనరీ
|
|
»
|
లాంగ్మన్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్
|
|
»
|
లాంగ్మన్ కార్పస్ నెట్వర్క్ నుంచి సమాచారం
|
వివిధ కీలక సమాచారాన్ని పూర్తి చేయటానికి పియర్సన్ ఎడ్యుకేషన్ వారితో జాఅస సంబంధాలను కొనసాగిస్తుంది.
|
|
|
|