ఇండియన్ యూనివర్సిటీస్ డేటాబేస్

భారత దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విద్యా సంస్థల గురించి సమాచారం అందజేయడానికి ఇండియన్ యూనివర్సిటీస్ డేటాబేస్ అనే ఒక సమాచారనిధిని జాఅస సృష్టించింది. ఈ సమాచారనిధి ఆయా విశ్వవిద్యాలయాలలో బోధించే పాఠ్యక్రమాలు, పాఠ్యప్రణాళికలు ఇంకా చదవాల్సిన పుస్తకాల జాబితాకు సంబంధించిన సమాచారం అందజేస్తుంది, ఇందులో మీరు సంస్థల వెబ్ చిరునామాలు కూడా చూడవచ్చు. ప్రస్తుతం సమాచారనిధిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు పొందిన 155 భారతీయ విశ్వవిద్యాలయాల వివరాలు ఉన్నాయి. విభిన్న విషయాలలో బోధించే పాఠాలు, పాఠ్యక్రమాల వివరాలు ఈ సమాచారనిధిలో లభ్యమవుతాయి. ఈ సమాచార పూర్తి రచనా సామాగ్రిలో విశ్వవిద్యాలయాలలో నిర్దిష్టిత గ్రంథ శీర్షికలు, ఆ గ్రంథ రచయితలు, ప్రచురణకర్తల పేర్లు, మొ. వివరాల డిజిటైజ్ చేయబడిన జాబితా లభిస్తుంది.

మరింత సమాచారానికి మాడ్యూల్లో శోధన క్రియ - విద్యార్థులకు, విద్యావేత్తలకు, భారత దేశంలో ఉన్న విద్యా సంస్థలలో బోధించబడే పాఠ్యక్రమాలకు, పాఠ్యప్రణాళికలకు సంబంధించిన నూతన సమాచారం పొందడానికి సహాయపడుతుంది. తమ బోధన ప్రణాళికలను పునఃపరిశీలించక ముందు విశ్వవిద్యాలయ బోర్డులు ఇతర విశ్వవిద్యాలయాల పాఠ్యక్రమ వివరాలను పాఠ్యప్రణాళికల వ్యవస్థీకరణను సమీక్షించుకోవచ్చు. ఇది గ్రామీణ మరియు నగర ప్రాంతాల విశ్వవిద్యాలయాల మధ్య సమానత్వం ఏర్పర్చడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో, ఆసక్తిగల వాళ్లందరికి అందుబాటును పెంపొందించేందుకు జాఅస సమాచారనిధిని ఒక ముద్రిత పాఠ్యాంతరంతో పాటు సీడీలు మరియు ఇతర చిన్న మాధ్యమ ఉపకరణాలలో విడుదల చేయవచ్చు. విషయాల జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి