|
పరిభాష
జ్ఞాన పుస్తకాల అనువాదానికి భారతీయభాషలలో ప్రామాణిక శాస్త్ర సాంకేతిక పరిభాష అనువాదకులకు
అనివార్యం. ఈ పరిభాష అనువాదంలోనూ వాటి వినియోగంలోను ఇప్పటివరకు భారతీయభాషలలో ఏకరూపత
లేదు. ఇది అత్యంత ప్రాథమిక అవసరం. తమిళం, బెంగాలీ వంటి కొన్ని భాషలలో సాంకేతిక పరిభాషకు
ఒకటి కంటే ఎక్కువ వనరులు ఉన్నాయి కానీ కొన్ని భారతీయ భాషలలో ఒక్క పారిభాషిక పదకోశం
కూడా లేదు. శాస్త్రీయ మరియు సాంకేతిక పరిభాష సంఘ సమితి (సి.ఎస్.టి.టి.) సహభాగస్వామ్యంతో
భారతీయభాషలలో సాంకేతిక పరిభాషను ప్రామాణికరించే దిశగా జాఅస పనిచేస్తుంది. 22 షెడ్యూల్డ్
భారతీయభాషలలో శాస్త్రీయ మరియు సాంకేతిక పరిభాషను రూపొందించి, శాస్త్రీయ మరియు సాంకేతిక
పరిభాష సంఘ సమితి (సి.ఎస్.టి.టి.)ని బలోపేతం చేయడానికి జాతీయ అనువాద సమితి ప్రయత్నాలు
చేస్తుంది. అంతేకాకుండా, ఈ పరిభాషను ప్రామాణికరించి, జ్ఞాన పుస్తకాల అనువాదాలు త్వరితగతిని
చేసే సామర్ధ్యాన్ని పెంచడానికి జాతీయ అనువాద సమితి కృషి చేస్తుంది.
|
|
|
|