|
అనువదించవలసిన జ్ఞాన పుస్తకాలను గుర్తించటం
జాతీయ అనువాద సమితి అనువాదం చేయించడానికి తీసుకునే జ్ఞాన పుస్తకాలను ఇండియన్ యూనివర్సిటీస్
డేటాబేస్ నుంచి పాఠ్య ప్రణాళికలలో అత్యధికంగా నిర్దేశించిన జ్ఞాన పుస్తకాలను గుర్తించి,
వాటి జాబితాను నిపుణుల పునః పరీక్షణం ద్వారాఎంపిక చేస్తుంది. బోధకులు, విద్యార్థులు,
వివిధ భాషల నేపథ్యంగల శాస్త్రవిషయ సంబంధిత ఇతర నిపుణులను సంప్రదించి, భారతీయ భాషలలో
ఈ పుస్తకాలకు ఉన్న గిరాకీపై వారి అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఈ జాబితాను మరల పరీక్షీంచి
అధిక సంఖ్యాక విద్యార్థులకు విద్యావేత్తలకు లబ్ది కలిగించే విధంగా ఉన్న పుస్తకాల జాబితాను
తయారు చేయడం జరిగింది. చివరికి పుస్తక జాబితాను జ్ఞాన పుస్తకాల ఎంపిక కోసం ఏర్పర్చిన
సహసంఘం మరియు జాఅస పథక సలహా సంఘం ఆమోదిస్తుంది.
ముందుగా, 21 శాస్త్ర విషయాలలో నిపుణులు సిఫారసు చేసిన పుస్తకాలను జాఅస సేకరించింది. ఈ శాస్త్ర విషయాలలో 105 పుస్తకాలను అనువాదం చేయించి, అచ్చువేసే దిశలో ప్రస్తుతం కృషి జరుపుతుంది..
|
|
|