|
ప్రచురణలు
అనువాద విధానాన్ని మరింత క్రమబద్ధంగా చేయటానికి జాతీయ అనువాద సమితి కొన్ని పద్ధతుల్ని
అనుసరిస్తుంది. అవి ఏమిటంటే: అనువదించవలసిన పుస్తకాలను గుర్తించటం; అలా గుర్తించిన
పుస్తకాలకు రచనాస్వామ్యహక్కుల్నిపొందటం; భారతీయ భాషలలో ప్రచురణకర్తల్ని సంప్రదించటం
ఇంకా అనువాదం చేసిన పుస్తకాలను భారతీయ భాషల సంపాదకీయ సహాయక బృంద మార్గదర్శకంలో సమీక్ష
చేయించటం. అనువాద సమీక్ష రెండు వేరువేరు స్థాయిలలో జరుగుతుంది. ప్రాథమిక సమీక్ష మరియు
ఆమోదానికి ఒక పది పేజీల అనువాదాన్ని అనువాదకుడు లేదా అనువాదకురాలు జాతీయ అనువాద సమితికి
అందజేయవలసి ఉంటుంది. పూర్తిగా అనువాదం చేసిన పుస్తకప్రతిని అందజేసిన తర్వాత తుది అనువాద
సమీక్ష ఉంటుంది. గుణాత్మక అనువాద నిర్వహణకు ఈ అంచెలవారీ సమీక్ష సహాయపడుతుంది.
|
|
|