సమాచారనిధులు
జాఅస, నేష్నల్ రెజిస్టర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ (ఎన్ ఆర్ టీ), ఫ్యాకల్టీ డేటాబేస్, ఎక్స్పర్ట్స్
రిపాజిటరీ, పబ్లిషర్స్ డేటాబేస్, బిబ్లియోగ్రఫీ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ డేటాబేస్ మరియు
డిక్షనరీస్ అండ్ గ్లాజరీస్ డేటాబేస్ వంటి ఆరు సమాచార నిధులను సృష్టించింది. ఈ సమాచారనిధులు
జాఅస కార్యకలాపాలలో సహాయపడడమే కాకుండా నిపుణులకు, ప్రచురణకర్తలకు, విద్యార్థులకు, అనువాదకులకు
సహాయపడ్తాయి. ఈ సమాచారనిధులు, భారతీయ భాషలలో అనువాదకులు; ప్రధాన విశ్వవిద్యాలయాలు మరియు
వాటి పాఠ్యక్రమ సామాగ్రి; వివిధ విషయాలలో బోధకులు నిపుణులు; అన్ని భారతీయ భాషలలోని
ముఖ్య ప్రచురణ నిలయాలు; వివిధ భారతీయ భాషలలో అనువాద పాఠాలు; నిఘంటువులు, శబ్దావళులు
మరియు నానార్థ పద నిఘంటువులకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాయి. విద్యార్థులకు,
పరిశోధన విద్యార్థులకు అలాగే విభిన్న విషయాల బోధకులకు కాడా ఈ సమాచారనిధులు ఉపయోగపడ్తాయి.
|
|