అనువాదక విద్యా కార్యక్రమం

జాతీయ అనువాద సమితి అనువాదక విద్యా కార్యక్రమం ప్రాథమికంగా జ్ఞాన పుస్తకాలను అనువాదం చేయడానికి అనువాదకులకు కావలసిన శిక్షణపైన దృష్టి కేంద్రీకరిస్తుంది. అనువాదం చేయడాన్నివృత్తిగా చేప్పట్టే వారికి ఇది విద్యయిక సంబంధమైన మద్దతునిస్తుంది. భారతదేశంలోని అనువాద చరిత్ర,, సంప్రదాయం; భారతీయ భాషలలో జ్ఞాన పుస్తకాల అనువాదం చేస్తున్నప్పుడు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు; నిఘంటువులు, పారిభాషిక పదకోశాలు మరియు పర్యాయ పదకోశాల వంటి అనువాద ఉపకరణాలను ఏ విధంగా ఉపయోగించాలనే వాటిపైన శిక్షణ ఇస్తుంది. ఇది బహుముఖప్రజ్ఞగల వృత్తినిపుణ అనువాదకులను తయారుచెయ్యాలని కూడా భావిస్తుంది. పైన ఉద్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి కార్యగోష్ఠులు, శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ట్రాన్సలేషన్ టుడే (జాఅస - ద్వివార్షిక పత్రిక), హ్యాండ్ బుక్ ఫర్ ట్రాన్సలేటర్స్, అనువాదక విద్య నిమిత్తం జాఅస మీడియా తయారు చేసిన దృశ్యశ్రవణ సామగ్రి, జాఅస పాఠ్యప్రణాళికా సామగ్రి అనువాదకులను విద్యావంతుల్ని చేయడానికి ఉపకరిస్తాయి.