తరచుగా అడిగే ప్రశ్నలు

1. నేను జాఅసలో భాగస్వామిని ఎలా కాగలను? నేను జాఅసలో అనువాదకునిగా ఎలా నమోదు చేసుకోవాలి? పూర్వ పట్టభద్ర విద్యార్థిగా జాఅసలో నమోదు చేసుకోవటం ఎలా?
. మీ సవివర విద్య అనుభవసారాన్ని http://www.ntm.org.in/languages/english/login.aspx. సందర్శించి దాఖలు చేసుకోవటం ద్వారా చేయవచ్చు. దీనికి జవాబును వీలైనంత త్వరలోనే పొందగలరని హామీ ఇస్తున్నాం.

2. నేను ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని అనువదించి, అచ్చువేయాలనుకొంటున్నాను. దీనిని జాఅస పరిధిలో చేయటం ఎలా?
. మీ పని నమూనాలతో పాటుగా మీ సవివర పథక ప్రతిపాదనను దాఖలు చేయండి. మా బృందం దీనిని మూల్యాంకనం చేసి దానిపై వాటి నిపుణుల స్పందనను మీకు తెలియజేసారు.

3. జాఅస సహసంబంధికావటానికి ముందుగా కావలసినవి ఏమిటి?
. అనువాదకుల అవసరంలో జాఅస అద్వితీయమైనది. మూలభాష, లక్ష్య భాషలలో మీ నైపుణ్యంతోపాటు ఇచ్చిన గడువును పని పూర్తిచేసి ఇవ్వగల సామర్థ్యం కల్గివుండటానికి మించి జాఅస మీ నుంచి ఏమీ కోరుకోదు. జాఅసలో భావి అనువాదకులకు వయస్సు, విద్యార్హతలు, ఉండేస్థలం ఇవేవీ అడ్డం కావు.

4. నాకు స్థల నిర్భంధం ఉంది. అయినప్పటికీ, నేను జాఅసలో సహసంబంధిని కాగలనా?
. అనువాదానికి సంబధించి తీవ్రతృష్ణ కలిగినవారిని ప్రోత్సహించటానికి, అనువాద పరిశ్రమను వృద్ధిచేయటానికి జాఅస నిర్మితమైనది. ఈ పథకానికి స్థలం ఏమీ ఆటంకం కాదు. ప్రపంచంలో ఎక్కడనుంచైనా ఈ పథకంలో భాగస్థులు కావచ్చు.

5. బహుమాధ్యమ అనువాదం అంటే ఏమిటి?
. విస్తారంగా రాసిన, మాట్లాడిన ప్రమాణ పత్రాలను అనువదించటం లేక వ్యాఖ్యానించటం బహుమాధ్యమ అనువాదం. ఆ రెండు సూచనల పరిధిలో లేని ప్రతిదానిని చక్కగా బహుమాధ్యమ అనువాదంలో ఇముడ్చుకుంటుంది. ఉదా: కథనాత్మకాన్ని అందించటం, నేపథ్య వ్యాఖ్యాన సేవలు, ఉపశీర్షికలు, వెబ్సైట్ అనువాదం, బహుభాషా ముద్రణా ప్రతి తయారీ ఇవన్నీ బహుమధ్యమ అనువాద పరిధిలోనికి వస్తాయి.

6. నేపథ్య వ్యాఖ్యానం, కథనాత్మకం మీ అనువాదం పథకాలలో భాగాలవుతాయా?
. భాభాకేసం(సి.ఐ.ఐ.ఎల్.) విస్తారంగా కథా చిత్రాలను ఉత్పత్తి చేస్తుంది. నేపథ్యవ్యాఖ్యాన, కథనాత్మక, మరింకా అనేక పథకాలను వ్యవహరిస్తుంది. ఈ సంస్థకు వీటిపై ప్రక్రియా విధాన సౌకర్యాలకు ఆధారంగా వృత్తిపరమైన చిత్రశాల కూడా ఉంది. కనుక, ఏ పథకానికైన ఈ ప్రత్యేక అవసరాలు కలిగి ఉంటే దానికి కావలసిన ఉపకరణాలను తప్పనిసరిగా ఉపయోగించుకుంటుంది.

7. నీవు ఏదైనా అనువాద ఉపకరణాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నావా?
. నిఘంటువు, అనువాదదానికి వనరులుగల్గిన సాఫ్ట్వేర్లు, పదజాలంవంటి ఉన్నతగుణ ఉపకరణాలను ఉత్పాదన జాఅస లక్ష్యాలలో ఒకటి. ఈ ఉపకరణాల నుంచి లబ్దిపొందుకోవాలనుకునే వారికందరికీ అందుబాటులో ఉంటాయి.

8. అనువాదించేటప్పుడు ఏ విధమైన పద్ధతిని అనుసరించాలి.
.

9. అనువాదానికి అంచనా ఎలా పొందుకోవాలా?
.

10. అనువాదకుల ఎంపికకు ఏదైనా తరగతులను శిక్షణా శిబిరాలను రూపకల్పన చేశారా?
. జాఅస ప్రాథమిక లక్ష్యాలలో అనువాదకుల విద్య ఒకటి. దీనికి ప్రత్యేకించిన శిక్షణ అవసరం. జాఅస భావి అనువాదకులకోసం స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను అనువాదకుల పాఠ్యక్రమాన్ని, మోడ్యూళ్లను, ప్యాకేజీలను ఉత్పాదన చేసి, ప్రోత్సహించటం, మద్దత్తునివ్వటం, అనువాద సాంకేతజ్ఞతలో ప్రత్యేక పాఠ్యక్రమాన్ని వృద్ధి చేయటానికి సహాయం చేయటం, పరిశోధనా పథకాలను ప్రోత్సహించటం, సంస్థాగత పరిశోధనా ఉపకారవేతన కార్యకలాపాలను ప్రోత్సహించటం, పనిశిక్షణా శిబిరాలను వర్క్షాపులను నిర్వహించటం ఇంకా ఇలాంటివి అనేకం అనువాదకులు సవరించటానికి, సంకలనల చేయడానికి, అనువాదాల నకలు ప్రతి సంకలనానికి సహాయం చేస్తుంది.

11. నేను ఎంపిక చేసుకున్న పుస్తకం అనువాదాలు చేయవచ్చా? పుస్తక ఎంపిక పుస్తకాన్ని ఇవ్వడం రెంటిని కూడా జాఅస చేస్తుందా?
. జాఅస జ్ఞాన గ్రంథ సమాచార నిధి అనువాద సామగ్రికి ఆధారం.