దీనిలో నిమగ్నమైన వాళ్లు: కార్యనిర్వాహక వర్గాలు

భారతీయ భాషల కేంద్రీయ సంస్థ (భాభాస)

భారతీయ భాషల కేంద్రీయ సంస్థ (భాభాస) జాఅసకు అన్ని సదుపాయాలు కల్పించి ముఖ్య కార్యాలయంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ఈ భాభాస ప్రాంగణం నుంచే సమితి కార్యాలను నిర్వహిస్తుంది. భాభాస సంచాలకులు సమితికి ముఖ్య అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఒక సమర్థాధికార ఆమోదం పొందిన తర్వాత జాఅస ఒక స్వయంప్రతిపత్తిగల సంస్థగా మారుతుందని ఆశించడం జరిగింది. సాహిత్య అకాడమీ, నేష్నల్ బుక్ ట్రస్ట్ (ఎన్ బీ టి), శాస్త్రీయ సాంకేతిక పరిభాషా కేంద్రం (సీఎస్ టిటి), సీ-డ్యాక్ మొదలైన జాతీయ సంస్థల సమన్వయంతో జాఅస పనిచేస్తుంది.

జాఅసకు ఉన్నత నిర్ణయ బృందం రూపంలో పథక సలహా సంఘం (జాఅస-పసస) ఉంది. ఈ సంఘంలో 25మంది నిపుణులు ఉన్నారు, వాళ్లలో అనువాదాన్ని బోధిస్తున్నవారు, అభ్యసిస్తున్న మేధావులు, నిపుణులు; రచయితలు; సాహిత్యవేత్తలు; సాహితీ అకాడమీల అధ్యక్షులు; విశ్వవిద్యాలయాల ఉప-కులపతులు; పుస్తక విక్రేతలు, ప్రచురణకర్తల సంఘ సభ్యులు; సమాచార సంకేతజ్ఞత శాఖ, భారత ప్రభుత్వం; మరియు ఐఐటీల వంటి సంస్థల నుంచి ఆచార్యులు ఉన్నారు.

సమితి కార్యాలను నిర్వహించడంలో సమితికి మార్గనిర్దేశనం చేయడానికి మరియు సలహాలు అందించడానికి పసస కాకుండా జాఅసకు కింది నాలుగు ఉప సంఘాలు ఉన్నాయి:
i. అనువాదకుల ధరలకు ఉప సంఘం,
ii. రచనాస్వామ్య, చట్టబద్ధ విషయాలకు ఉప సంఘం
iii. అనువదించవలసిన జ్ఞానగ్రంథాల నిమిత్తం ఉప సంఘం
iv. సహాయనిధుల మంజూరుకు ఉప సంఘం
 
పథక సలహా సంఘం (జాఅస-పసస)
ముఖ్య అధికారి (నోడల్ ఆఫీసరు): సంచాలకుడు, భారతీయ భాషల కేంద్రీయ సంస్థ
పథక సంచాలకులు (ప్రాజెక్ట్ డైరెక్టరు)
జాఅసకు అనుమతించిన పదవులు: 65
సహాయక సిబ్బంది