ఆరంభం

అసలు జాతీయ అనువాద సమితి అనే ఆలోచన భారత ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ నుంచి చిగురించింది, జాతీయ జ్ఞాన సమితి (జాజ్ఞాస) నిర్వహించిన మొదటి సమావేశంలో - ఎన్నో సంక్లిష్ట క్షేత్రాలలో జ్ఞానా సముపార్జనను పెంపొందిచడానికి, విద్య, ఇంకా ఇతర నిరంతర అభ్యాసంలో ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతపరచి పటిష్ఠం చేయడానికి అనువాద సామాగ్రి ఎంత ముఖ్యమో డా. మన్మోహన్ సింగ్ ప్రస్తావించారు. శ్రీ శ్యామ్ పిత్రోదా అద్యక్షతన ఏర్పడిన కమిషన్ ఈ సలహాను పరిశీలించి భారత దేశంలో విద్య కోసం అనువాద ప్రక్రియను ప్రోత్సాహించడానికి ఒక ప్రత్యేక సంస్థ లేదా సమితి అత్యవసరమని తెలిపింది.

భారత దేశంలో అనువాదం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నదనేది నిజం. అయితే ఈ కీలక క్షేత్రంలో ప్రయోజనకరమైన ప్రజా జోక్యం ప్రధానంగా దేశంలో అనువాద ప్రక్రియ ఎగుడుదిగుడుల కారణంగా తలెత్తుతున్నాయి. ఈ ఎగుడుదిగుడులు అనగా విషయాలు, భాషలు అలాగే నాణ్యత, వ్యాప్తి ఇంకా పొందిక. అనువాద కార్యాకలాపాలు ప్రత్యక్ష పరోక్ష ఉపాధులను కల్పిస్తాయి. ఈ విధంగా చదువుకున్న నిరుద్యోగులకు ప్రజా సేవకు అవకాశం కల్పించడమే కాక ఉపాధులు కూడా కల్పిస్తుంది.

అనువాదం ద్వారా జ్ఞాన సమాజం ఏర్పాటుపై జాగృతి, మానవ వనరుల అభివృద్ధిని జాతీయ జ్ఞాన సమితి (జాజ్ఞాస) ద్వారా డా. జయతీఘోష్ నేతృత్వంలో ఒక కార్యాచరణ బృందం ఏర్పాటుకు దారి తీసింది. ఈ కార్యాచరణ బృందం అనువాద కార్యకలాపంలో నిమగ్నమైన విభిన్నసంస్థలు వ్యక్తులను ఒక చోటుకి చేర్చి, అనువాద ప్రక్రియ ప్రచారం, ప్రచురణ, వాటి వ్యాప్తికి తోడ్పడుతుంది. ఈ కార్య బృందంలో సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పాక్షిక మద్దతుగల ప్రభుత్వ సంస్థలు, విద్యా విషయిక సంస్థలు, భాషాశాస్త్రవేత్తలు, అనువాదకులు, విద్యావేత్తలు, ప్రచురణకర్తలు, భారత దేశంలో అనువాద కార్యకలాపాలతో సంబంధంగల సంస్థలన్నిటి నుంచి ప్రతినిధులను సభ్యులుగా చేర్చడం జరిగింది. ఫిబ్రవరి, 2006 ఢిల్లీలో బృందం కలిసినప్పుడు భారతీయ భాషల కేంద్రీయ సంస్థ యొక్క అప్పటి డైరెక్టర్ అయిన ప్రొఫ్. ఉదయనారాయణ సింగ్ గారు ఈ క్షేత్ర విస్తృత బాహ్య చిత్రాన్ని ముందుంచారు.