|
అనుబంధం - 1:
అనువాద పరిశ్రమను ప్రోత్సహించటం
|
(జయతీ ఘోష్ నుండి వివరం)
|
భారతదేశంలో వేగంగా, సామర్థ్యంతో “ఉన్నత గుణ అనువాద పరిశ్రమ” అవసరం మనడానికంటే తప్పనిసరి
అనటం స్పష్టం: భారతీయభాషల వైవిధ్యాన్ని, ఔన్నత్యాన్ని బలపేతం చేస్తూ పరిరక్షించాల్సిన
అవసరం ఉంది. భారీ స్థాయి ఉన్న సామగ్రికి అన్ని భాషావర్గాలను విస్తృతంగా వారి సొంత భాషలో
ప్రవేశాన్ని కలిగించి అందించటం. మనం గుర్తించవలసినది ఏమిటంటే, అన్నిదేశాలు, జ్ఞాన లబ్దిపై
వెచ్చించి, శాస్త్రీయంగా ఉన్నతించిన అనువాద సేవలను కలిగి ఉండాలి మరియు వివిధ భాషలలో
అందుబాటులో ఉన్న రకరకాల సామగ్రినంతా సిద్ధంచేసి సాధ్యపరచాలి. చైనావంటి అభివృద్ధిచెందిన
విదేశాలు అనువాద పరిశ్రమ విషయంలో చురుకుగా ప్రకంపనాలు కలిగిస్తూ, ఎప్పటికప్పుడు విస్తారపరిసరాలలో
తాజాసమాచారాన్ని సమకూర్చుకుంటూపోతున్నాయి. అభివృద్ధిచెందిన అతి చిన్న దేశంలో, అధిక
నిష్పత్తిలో, ప్రధాన విదేశీ భాషలలో విద్యావంతులుగాను, అనర్గళంగా మాట్లాడగలిగేవారుగాను,
ఉన్నతి కలిగినవారిగాను ఉన్నారన్నది నిజమే ఐరోపాలోని ఫిన్లాండ్ మరియు నెదర్లాండ్. అక్కడ
స్థానికభాషలు చాలా బలీయంగా ఉన్నాయి. ఎందుకంటే విస్తృతమైన అనువాదాలు అందుబాటులో ఉన్నాయి
గనుక.
అనువాదం కాలవసినది:
|
|
»
|
ఇంగ్లిషు నుంచి భారతీయ భాషలలోనికి
|
|
»
|
భారతీయ భాషలలోనుండి ఇంగ్లిషులోనికి
|
|
»
|
భారతీయ భాషలమధ్య
|
ఈ కింది సామగ్రిని అనువాదం చేయవలసిన అవసరం ఉంది:
|
|
»
|
పాఠశాల స్థాయిలో పాఠ్యగ్రంథాలు.
|
|
»
|
ఉన్నత విద్య స్థాయిలో పాఠ్యగ్రంథాలు
|
|
»
|
ఇతర బోధనా శాస్త్ర సామగ్రి
|
|
»
|
విజ్ఞానశాస్త్రాలు, సామాజికశాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, కళలలో ప్రత్యేక పుస్తకాలు
|
|
»
|
ఉపయుక్త గ్రంథాలు (విజ్ఞాన సర్వస్వాలు మొదలైనవి)
|
|
»
|
సాహిత్యం
|
|
»
|
ప్రస్తుత అభిరుచిగల కాల్పనికేతర గ్రంథాలు
|
|
»
|
నిబంధన పత్రాలు
|
|
»
|
సంకీర్ణ పత్రికలు, పత్రికలు
|
|
»
|
వెబ్ ఆధారిత సామగ్రి
|
ఈ క్షణానికి, వివిధ ప్రాంతాలలో ఇతర వ్యాపకాలతో పాటుగా కొన్ని సంస్థలు వీటి వ్యవహారాలను
కూడా చూస్తున్నాయి. ఇవి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు. ఈ విధంగానే జాతీయ పుస్తక
మండలి (ఇంగ్లిషు నుండి ప్రధాన భారతీయ భాషలలోనికి, విపర్యాయంగా కూడా) కొన్ని ప్రధాన
సాహితీ రచనలను, ప్రాచుర్యం పొందిన, బహుమానాల పొందిన రచయితల రచనలకు అనువాదాలను అందిస్తుంది.
కొన్ని ప్రైవేటు సంస్థలు (ఉదా:-కథ ప్రచురణకర్తలు, ప్రజాశక్తి దినపత్రిక వర్గం మొదలైనవి)
ప్రఖ్యాతిగాంచిన సాహితీ రచనల అనువాదాలను మరియు ప్రస్తుత అభిరుచి గల కొన్ని పుస్తకాలను
అందించాయి. పైన తెలియజేసిన అన్ని అంశాలను, శాస్త్రీయంగా, వ్యవహారాలను చూసుకుంటూ, అన్ని
భారతీయభాషలలో కూడా నేరుగా ప్రమేయం కలిగివుండటానికి, నిర్వహణకు, ఉన్నతి కల్పించటానికి
ప్రభుత్వపరమైన సంస్థ ఒకటీ లేదు.
అనువాదానికి సంబంధించిన ప్రస్తుత సమస్యలు:
|
1.
|
పైన తెలియజేసిన అన్ని విషయాలలో అనువదించిన సామగ్రికి సంబంధించి భారీ మరియు సంక్లిష్టమైన
ఖాళీలు.
|
2.
|
గుణం మరియు ప్రవేశయోగ్యతలోనూ గుర్తించదగిన సమస్యలున్నాయి. వీటి సాధారణ రీతి, గుణం,
అసమతుల్యంతోనూ నాసిరకంగా ఉన్నాయి. మక్కికి మక్కి అనువాదం చేసే విధానం కూడా కొనసాగుతుంది.
లేక విస్తృతంగా సంక్లిష్టమై ఉండటం. ఇది ప్రవేశయోగ్యతను (పఠనా సౌలభ్యాన్ని) తక్కువ జేస్తున్నాయి.
అనువదించిన రచన ఉత్పాదనా గుణం తీవ్ర విభిన్నత్వాన్ని కలిగి వుంది.
|
3.
|
అనువాదాలు సారాన్ని కోల్పోయినవిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగానూ, ఇటీవలివి, మరి ఇప్పటివి
అనువాదాలు కూడా సాధారణంగా అందుబాటులో లేవు.
|
4.
|
అనువదించిన సామగ్రి వ్యాప్తి ఉన్నతి, మందకొడిగా ఉంది. మంచి గుణం కల్గిన అనువాదాలు ఉన్నప్పటికి
కూడా. వీటిని ఉపయోగించుకోవాలనుకుంటున్నవారికి అనువాదాలు అందుబాటులలో ఉన్నాయనే విషయం
కూడా తెలియదు.
|
5.
|
అనువాదాన్ని కొనసాగించటానికి దాదాపు సమన్వయం లేదనే చెప్పాలి. అనవసరమైన నకిలీలు, ఇంకా
సంక్లిష్ట ఖాళీలు ఉండనే ఉన్నాయి.
|
6.
|
అనువాదానికి వెబ్ అనువాద సేవలు ఒక ప్రాంతీయభాష నుంచి మరొక ప్రాంతీయ భాషలోనికి ఇంకా
అతినవీన దశలోనే ఉంది. ఎమ్.టి. ప్రయత్నాలున్నాయి. అవి:సి-డిఎసి:వ్యాకర్త Vyakarta. మంత్ర
(MANTRA), ఎన్సిఎస్టి ముంబై; మాత్ర (MaTra) ఐటీలు (ప్రత్యేకంగా కాన్పురు) అనుసారక Anusaaraka,
ఆంగ్లభారతి Anglabharati మొదలైనవి. వీటికి ఇంకా వాక్యసారూప్యాలతో సమస్యలున్నాయి. భారతీయ
భాషలకు సంబంధించి సాపేక్షంగా ఇవి విజయవంతమైన ప్రదర్శనలు, ఆన్లైన్ పద వనరుల కొరత, సమన్వయ
కొంత సాధారణం కనిపిస్తున్నది.
|
ఏదీ ఏమైనప్పటికీ, భారతదేశంలో త్వరితగతిని అనువాద సేవల అభివృద్ధివలన కొన్ని లాభాలు కూడా లేకపోలేదు.
|
1.
|
గుర్తించదగినంత మంది ద్విభాషా గలిగిన జనాభా ఉంది. వారిని ఈ రకమైన కార్యకలాపాలలో నియమించటం ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా ఇది విద్యావంతుల ఉద్యోగిత ఉత్పాదనకు ఒక ముఖ్యమైన ఆధారంగా ఉంటుంది.
|
2.
|
భాషాశిక్షణ అందించే సంస్థలు సంఖ్యకాలుగా ఉండనే ఉన్నాయి. సాపేక్షికంగా, తేలికగా పెంపుదల చేయవచ్చు. ప్రతిభావంతమైన అనువాదానికి కావలసి అదనపు నైపుణ్యాలు తేలికగా సముపార్జించుకోవచ్చు. వాటిని ప్రస్తుతమున్న పాఠ్యాంశాలలో చేర్చుకోవచ్చు.
|
3.
|
రచనా హక్కుల విషయంలో, అనువాదం సాపేక్షికంగా తక్కువ విఫణిని కల్గి వుంది. ఎందుకంటే అనువాదానికి సంబంధించి విశిష్టత చాలా తక్కువగా ఉంది. దీని అర్థమేమిటంటే, తక్కువ ధరగల పుస్తక ప్రతులు కలిగి ఉన్నాయని అర్థం. వీటిని తేలికగా అందించవచ్చు.
|
4.
|
సంపుటాలు పెద్దవిగా ఉంటాయి. ఇవి తక్కువ ధర ఉత్పాదనకు అనుమతిస్తాయి. ఒకసారి ప్రాథమిక నిర్మాణాలు వృద్ధి చేశారంటే ప్రైవేటు రంగాన్ని గొప్పతరంగా పాల్గొనేటట్లు చేస్తుంది.
|
పరిగణలోనికి తీసుకోవలసిన అంశాలు
|
|
»
|
అనువాదాన్ని అందించే ప్రభుత్వ సంస్థలు ఏమేమి ఉన్నాయి? అవి ఎంత ప్రతిభావంతమైనవి?
|
|
»
|
ఆ కార్యకలాపంలో ప్రభుత్వరంగం పాల్గొనే పాత్ర ఏరీతిగా ఉంది? ఏదైనా బహిరంగంగా అదించదగిన సంక్లిష్టమైన అవస్థాపన అవసరమై ఉందా?
|
|
»
|
ఇటీవలి వివిధ రకాల సామగ్రికి హామీ ఇవ్వటానికి ఏవైనా అవకాశం ఉందా? (ఇటీవలి సాహిత్యం, ప్రస్తుత అభిరుచిగల రచనలు ముఖ్యమైన పత్రికలు, ఇవి ప్రధాన భాషలోనికి స్వయంచాలకంగా అనువాదం చేయగలుగుతాయా?ఎవరు నిర్ణయిస్తారు?వేటిని?
|
|
»
|
అటువంటి నిర్ణయాలు కేంద్రీయమై ఉండాలా?వద్దా? లేక ఆయా రాష్ట్రప్రభుత్వాల ద్వారా సమన్వయ పరచవచ్చా?
|
|
»
|
ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థ పాల్గొంటున్న స్థితి ఉందా? (రచనా హక్కుల కోసం, ఉన్నతికి, నిర్వహణకు, వివిధ రకాల అనువాద సేవలకు) ప్రైవేటు కార్యకలాపంగా ఎక్కువ ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది?
|
|
»
|
ఈ కార్యకలాపాలలో కొన్ని లేక ఇతర ప్రోత్సాహకాలను పెట్టుబడిని అందించవచ్చా? ప్రచురణ సంస్థలతో సహభాగ స్వామ్యం కలిగి వుండవచ్చా?
|
|
»
|
అనువాద, నిర్వహణల, పర్యవేక్షణ గుణవంతమైన హామీలను ఎలా చేయాలి? శిక్షణ నివ్వటానికి ప్రత్యేక వనరులను కేటాయించవలసిన అవసరం మరియు ఈ పరిసరంలో సృజన, వృత్తిపరంగా నిపుణుల అంకిత భావం అవసర మంటారా?
|
|
»
|
అనువదించిన సామగ్రి అందజేయటంలో ఎంత గొప్పతర వేగంగా ప్రోత్సహించవచ్చు?
|
|
»
|
ఎమ్టిలో ఉన్న సాధ్యతలు ఏమిటి? సంప్రదాయ అనువాద రూపాలకి ఎమ్టికి మధ్య ఏదైనా వాహకాలున్నాయా?
|
కోరదగిన అత్యవసర చర్య:
అనువాద పరిశ్రమను ఉన్నతించే అంశాలలో జాతీయ సమాలోచనత్వం, ప్రతినిధులను లీనమయ్యేటట్లు చేయటం; వీటి నుండి:
|
|
»
|
కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వ అధికారులు (భాషలు, విద్య, సంస్కృతి, శాస్త్ర శాఖల నుంచి)
|
|
»
|
పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు
|
|
»
|
పరిశ్రమ (అనువాదం వివిధ స్థాయిలో పనివారి అవసరం ఉంది)
|
|
»
|
మాధ్యమం
|
|
»
|
ప్రచురణ పరిశ్రమ
|
|
»
|
భాషా పాఠశాలలు
|
దీనికి సంబంధించిన వ్యక్తులను మరియు సంస్థలను గుర్తించాల్సిన అవసరం ఉంది. వీలైన త్వరగాను, పంపకాలను భావనాపరమైన రూపా కార్యక్రమప్రతిని ఆధారం చేసుకొని ఈ పరిసరంలో దీన్ని కొంత చర్చ మనకు అవసరం
|
|
|