|
అనుబంధం - II:
జాతీయ అనువాద సమితి ' కోసం
|
ఎన్ కె సి కి జయతీఘోష్ ప్రతిపాదన
(ఎన్కెసి అనువాద వర్క్షాపు 2006 ఫిబ్రవరి 11 మధ్య జరిగిన చర్చలు, తదనంతరం పాల్గొన్నవారితో
మరియు ఇతర రూపాలతో జరిపిన చర్చలను ఆధారం చేసుకొని)
|
వివిధ రకాల విభిన్న క్షేత్రాలలో (సాహిత్య, శాస్త్రీయ, సాంకేతిక, వాణిజ్య మొదలైన) అనువాదాల
గుణాన్ని మోతాదును వృద్ధిపరచటం అత్యవసరం (మానవ, యంత్ర సహాయక, త్వరితగతిని దేశవ్యాప్తంగా
జ్ఞానానికి గొప్ప సౌలభ్యం. ఆరంభించటానికి సరైన మార్గం ప్రక్రియకు, ఉన్నతికి మంచి గుణవత్తరమైన
అనువాదాన్ని దేశంలో అందించటానికి జాతీయ అనువాద సమితిని స్థాపించవలసి ఉంది. ఇది త్వరగా
లక్ష్యాన్ని చేపట్టి ఖాళీలను గుర్తించి గుణవంతమైన అనువాదాలకు ఉన్నతి కల్పించటం, శిక్షణ,
సమాచార వ్యాప్తి అనువాదకుల అనువాదాల గురించి ప్రభుత్వ మరియు ప్రైవేటు పనులకు సమన్వయపరచటం
సలహా జరుగుచున్న పనులను సమన్వ యం పరచటం. దీని ఉద్దేశమేమిటంటే, నకిలీ చేయకుండా లేక అవహేళన
చేయకుండా వివిధ ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల ద్వారా అవహేళన చేయబడకుండా ఉండటానికి,
కానీ వారి ప్రాధమ్యలను పునః పరిశీలన చేసుకోవడం, గుణాన్ని పెంచటం, అవగాహనని విశాల పరచటం.
ఒక కార్యక్రమంగా, భారత ఉపఖండంలో చాలా కాలంగా భిన్న భాషా జంటల మధ్య అనువాదం కొనసాగుతూ
ఉంది. అనువాదం, ఒక ప్రేరకంగా, భారతదేశంలోనూ బయటకూడా వివిధ భాషా సమజాల వ్యవహర్తల మధ్య
గొప్ప మేధావులని ఈ కార్యక్రమంలో చవిచూసింది. ఒక వృత్తిగా, అనువాదం ఒక సవాలుగాను లాభసాటియైనదిగాను
ఉంది, ప్రత్యేకంగా ఇటీవలి దశాబ్దులలో. ఒక పరిశోధనాక్షేత్రంగా, అనువాద అధ్యయనాలు ఒక
క్షేత్రంగా అసంఖ్యాక ఆలోచనలతోను, భాషాశాస్త్రం, తత్వశాస్త్రం, ‘సాహితీ అధ్యయనాలు, సంకేత
శాస్త్రం, నిఘంటు నిర్మాణశాస్త్రం, మానవవిజ్ఞాన శాస్త్రం, గణన శాస్త్రం మరియు ఇతర క్షేత్రాలకు
ఆతిథ్యమిచ్చేదిగా పరిణమించింది. కాని, అధిక భాషల్లో దాని వేగాన్ని పరిగణలో తీసుకొని,
దేశాలు, సంస్కృతులతో ఈ క్షేత్రం దాని కార్యకలాపాలకి తగినంత సమన్వయ ప్రయత్నాలు కొరత
ఉంది.
ఒక బహుభాషా, బహుసాంస్కృతిక దేశంగా, జ్ఞాన ఆధారాలకు అత్యంత ప్రాచీన మైనదిగాను, అనేక
శతాబ్ధాలుగా అనువాదంలో భారత దేశం ముందుంది. అనేక ప్రధాన భాషలతోను, సంస్కృతులతోను, అన్ని
సైద్ధాంతిక ప్రయత్నాలకు కూడా ఉన్నతమైన పరీక్షా ఆధారాలను ఈ దేశం అందిస్తుంది. ఊహిస్తున్నదేమిటంటే,
ప్రతిపాదిత జాతీయ అనువాదసమితి (జాఅస) దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భిన్న భాగాలను తీరుస్తుంది.
బోధకులు, నేర్వరులు, భాషాసాంకేతజ్ఞతా శాస్త్రవేత్తలు, వాణిజ్య వర్గాలు, దినపత్రికా
స్థాపకులు, మరియు ఇతర మాధ్యమ వర్గాలు, సృజనాత్మక రచయితలు, పాఠకులు, తులనాత్మక అధ్యయనాలలో
సమగ్రమైనవారు మరియు అనువాద సిద్ధాంతకర్తలు.
జాఅస ఈ కింది లక్ష్యాలను కలిగి ఉంటుంది :
|
1.
|
అనువాదాలపైన సమాచార కోశాగారంగా పనిచేస్తుంది. భారతీయ భాషలను లీనం చేస్తు, అన్ని అంశాలలో
అనువాదానికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. సృజన, నిర్వహణలద్వారా, అచ్చువేసిన
అనువాదాల సమాచారాన్ని నిరంతరం చేర్చుకుంటుంది. శిక్షణాకార్యక్రమాల పట్టిక, ఉన్న అనువాద
ఉపకరణాలు పరికరాలు, నవ్య ప్రయత్నాలు, మరియు జాతీయ అనువాదకుల జాబితా వంటి సౌకర్యాలతో
అందుబాటులో ఉంటుంది.
|
2.
|
వీలైనన్ని భారతీయ భాషలలో సైద్ధాంతిక మరియు ప్రాయోగికమైన అన్ని అనువాద కార్యక్రమాల పరిష్కార
గృహంగా ఉంటుంది
|
3.
|
భారతీయ భాషలకు సంబంధించి అనువాదాలలో పనిచేస్తున్నవారు, అనువాదకార్యకలాపాలలో నిమగ్నమైన
వ్యక్తులు, ఇతర సంస్థలు, ఏజన్సీలకు అనుసంధానం కలిగిస్తుంది.
|
4.
|
అత్యున్నత గుణవంతమైన అనువాదంద్వారా ప్రాంతీయ, విదేశాలలో కూడా భారతీయ భాషలని, సాహిత్యాలని
ముందుకు తీసుకు వెళుతుంది
|
5.
|
అనువాద ఉపకరణాలను ప్రత్యేకంగా ద్విభాషా నిఘంటువులను తయారుచేయటం మరియు బహుభాషానిఘంటువులను,
ద్వినిర్దేశాత్మక, సాధారణ, అదే విధంగా ప్రత్యేక అనువాదాత్మక నిఘంటులను పదశోధనిలు -
పర్యాయ పదకోశాలు, నిఘంటువులు సృజించుటకు మరియు నిర్వహించటం వంటివి చేస్తుంది
|
6.
|
వీటిని చేయటానికి లేక అచ్చువేసినవాటికి ఉన్నతి కల్పించటానికి, అనువాద అధ్యయనాలపై జరిగిన
పనిని, వాస్తవిక ప్రచురణలను సంయుక్తంగాగాని లేక స్వతంత్రంగాగాని అన్ని సంస్థల మరియు
ఈ క్షేత్రంలో అభిరుచి గలిగిన వ్యక్తుల లబ్ది కోసం చేయటం.
|
7.
|
ఒక చర్చావేదికను అందిస్తూ, లఘుసమాచార పత్రికావసతిని కల్పించటం. ఇది ప్రజల ప్రశ్నలకు
మరియు జవాబులకు ఉపయోగపడుతుంది
|
8.
|
అనువాద విధానశాస్త్రంలో మార్గదర్శకత్వం అందించటంతోపాటు కార్యకలాపాలని చేపట్టటం, అనువాద
అధ్యయనాలలో బోధన, శిక్షణ కార్యక్రమాలను సంపన్నం చేయటం
|
ప్రతిపాదిత జాతీయ అనువాద సమితి కీలక కార్యకలాపాలు:
అనువాదక విద్య :
ఇది ప్రతిబింబించే వాస్తవమేమిటంటే, అనువాదానికి ద్విభాషత్వం తప్పనిసరి నియమమని, అది
ఊహించుకొనదగినది కాదుగాని నేర్చుకోవలసిన ఒక ప్రత్యేక నిర్వాహకం. దీనికితోడు వివిధ రకాల
అనువాదాలను వివిధ రకాల నేపథ్యాలు అవసరం. ఉదాహరణకు సాహిత్య అనువాదం కంటే శాస్త్రీయ లేక
సాంకేతిక పనుల మరోవిధమైన దృక్పథం అవసరం అవుతుంది. ఇంకా, వ్యాఖ్యాన నైపుణ్యాలు సాపేక్షికంగా
అభివృద్ధి చెందని స్థితిలోనే ఉన్నాయి. ఇంకా దీనికి ప్రత్యేక శిక్షణ అవసరం, అదీ దానికి
సంబంధించిన మాధ్యమ సందర్భం ద్వారా (టీవి లేక రేడియో).
ఈ పరిసరంలో జాఅస కార్యక్రమాలు వీటిని కలుపుకొని ఉంటాయి:
|
|
»
|
స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను నడపటం
|
|
»
|
అనువాదలకులకు పాఠ్యక్రమ ప్యాకేజీలను సృజించటం. అది దేశవ్యాప్తంగా భాషాబోధనా పాఠ్యక్రమాలలో
భాగమై ఉంటుంది.
|
|
»
|
పరిశోధక ఉపకారవేతన కార్యక్రమాలు సంస్థల మధ్య పరిశోధకుల మార్పిడికి ఉపయోగపడతాయి. ఇక్కడ
ప్రత్యేకంగా నొక్కి చెప్పేదేమిటంటే, కేవలం ఇంగ్లీషు నుండి/లోనికి కంటే భారతీయ భాషలమధ్య
అనువాదం
|
|
»
|
పరిశోధన పథకాలను ప్రోత్సహించటం విద్యార్థుల పరిశోధనలతో కలిసి, ఒక ఉదాహరణగా ఉండేందుకు
ప్రత్యేకంగా గుర్తించిన గ్రంథాలకు మంచి అనువాదాలను అందించాలనే లక్ష్యంతో, వనరుల ఉత్పాదన.
ఇది కూడా శాస్త్రీయ బోధన లక్ష్యాల చేరుకునేందుకు సేవ చేస్తుంది
|
సమాచార వ్యాప్తి.
అనువాదం ప్రస్తుతం త్వరిత ప్రముఖమైనది, ఉన్నత పారితోషికం చెల్లించేదిగాను లేదు. మనదేశం
అనువాదానికి సంబంధించిన తగినంత సామర్థ్యాలను కలిగి వున్నాయనే జ్ఞానం కూడా తక్కువగా
వుండటం. ఇది సమర్థవంతులైన ఉపయోగితదారుల విషయంలో కూడా. ఉదా: ఒక ప్రత్యేక ప్రాంతీయ భాషలలో
చాలామంది మంచి అనువాదకులున్నారు. వీరు ప్రచురణకర్తలకు బాగా తెలియనివారు కావచ్చు లేకపోతే
ప్రచురణకర్తలను ఉపయోగించుకుంటున్నవారైనా కావచ్చు. భారతీయ భాషల కేంద్రీయ సంస్థ, మైసూరు
ప్రతిసంవత్సరం 400 మంది ఉపాధ్యాయులను ఒక భారతీయభాషలో అనర్గళంగా మాట్లాడటానికి శిక్షణ
నిస్తుంది. మరియు, దాని ప్రాంతీయ కేంద్రాలతో 20 భారతీయ భాషలకు ఏడునగరాలలో శిక్షణనిస్తుంది.
ఇది అవసరమని, దీని గుర్తింపు పెరుగుతున్నప్పటికీ, కొరతగా వున్న నైపుణ్యం. ఈ విధంగా,
శిక్షణ పొందిన ప్రజలు (దాదాపు 11,000 మంది ప్రస్తుతం ఉన్నారు) వీరు సమర్థవంతమైన ఉపయోగితాదార్లుగా
ఉంటారని ఎక్కువగా తెలిసినట్లు లేదు. చాలా భాషలలో, అనువాదాలు సృజించి అచ్చువేసిన చిన్న
ప్రచురణకర్తలు ఆయాలక్ష్యాల పరిసరాలలో ఉన్నాయి. కాని ఈ ఫలితం అధిక వర్గాలకు తెలియదు.
కనుక ఈ పరిసరంలో జాఅస ముఖ్యమైన కార్యకలాపాలు ఈ విధంగా ఉంటాయి:
|
|
»
|
అనువాదకుల సమాచార నిధిని వివిధ పరిసరాలలో వివిధ నైపుణ్యాలతో యోగ్యతలతో సృజించటం. ఈ
నిధి ఆన్లైనులో అందుబాటులో ఉంటుంది. ఇంకా జాఅసని ప్రత్యేక అవసరాల కోసం సంప్రదించవచ్చు.
|
|
»
|
ఉన్న వివిధ అనువాదాలకు పరిసరాలవారీగా టీక పట్టికతో ఒక సమాచార నిధిని సృజించటం, కొత్త
జాబితాలను ఎప్పటికప్పుడు క్రమంగా విద్యా సంస్థలకు , గ్రంథాలయ అనుసంధానాలకు మొదలైన వాటికి
పంపాలి.
|
మంచిగుణవంతమైన అనువాదసామగ్రిని వ్యాప్తి మరియు ఉన్నతి
చాలా అనువాద సామగ్రి వివిధ రకాలైనది అవసరమని ఒకరు వాదించవచ్చు. ఇప్పటికే విఫణి వాటిని
అందిస్తూ ఉండవచ్చు. ఏదీ ఏమైనప్పటికీ , సాధ్యతలపై జ్ఞాన రాహిత్యం లేకుంటే , వాస్తవానికి
పెరుగుచున్న వారి అవసరాలను నిరోధించవచ్చు. ఈ రకమైన అనేక ఇతర విధాలైన జ్ఞాన విషయాలలో
కూడాఇంతే. మీకు తెలియదు మీరేమి కోల్పోతున్నారో, మీరు దానికి ప్రభావితులు కాకపోతే, ఇంకా,
సాహిత్య సామగ్రి అనువాదంలో లీనమైనవారు (జాతీయ పుస్తక మండలి, గ్రంథ అకాడెమీలు వంటివి)
ఒకసారి ఉత్పాదన చేసిన తరువాత, అనువదించిన గ్రంథాలకు స్థానిక భాషలో అపరిమితమైన గిరాకీ
ఉంటుంది.
ఏదీ ఏమైనప్పటికీ, ముఖ్యంగా గుర్తించవలసిన దేమిటంటే, ఇది ఇంగ్లిషు నుండి భారతీయ భాషలలో
ఒకే మార్గం కాకూడదు. భారతీయ భాషలలో కూడా సామగ్రి సంపద ఉంది. దీనిని గొప్పతరంగా వ్యాప్తి
చేయవలసిన అవసరం ఉంది, ఇది ఇంగ్లిషులోను మరియు ఇతర భారతీయ భాషలలో కూడా. మరి ప్రత్యేకంగా,
సృజనాత్మకతకు అనువాదాన్ని సమాంతర దారిగా చూసే సంప్రదాయాన్ని ప్రోత్సహించాలి. క్షితిజ
సమాంతర రూపావళి అవసరం ఎంతైనా ఉంది. అది దాత భాషలనుంచి ఆదత్త భాషలకు ఏ రకమైన క్షితిలంబంగా
విలక్షితను కలిగించదు. సాంస్కృతిక వైవిధ్యంగల భారతదేశాన్ని మరియు బహుభాషత్వాన్ని ప్రోత్సహించేదిగానూ
ఉంటుంది . కొన్ని పరిసరాలలో, కొన్ని అనువాదాలకి బహుళోత్పాదకం (డాక్టర్, అంబేడ్కర్ రచనలు
అనేక భారతీయ భాషలలోనికి అనువాదం చేశారు) ఇది విస్తృతమైన సామాజిక మథనాన్ని, దానితోపాటుగా
నవ్య అక్షరాస్యతావర్గాలకు అవసరాలను ప్రతిబింబిస్తుంది.
శాస్త్రీయ మరియు సాంకేతిక అనువాదాలలో, ఇది సాహిత్యానువాదల వంటిది కాదు. పారిభాషపద,
మరియు భావనలకు ప్రామాణీకరణలోను గొప్పతరమైన అవసరం ఉంది. మంచి సమగ్రతకు హామీ ఇవ్వటం,
భాషల మధ్య తేలిక ఇమిడిపోయేటట్లు ఉండటాన్ని కలిగివుండాలి. ఇంకా, అనువాదం నేటికి సామాజిక
గుర్తింపు, ఆర్థిక పారితోషికం రెంటిలోను తక్కువ ప్రతిఫల కార్యక్రమంగా ఉంది. ఇవి మార్పునొందవలసి
ఉంది. గుర్తించవలసిన మరో ముఖ్య విషయమేమిటంటే, అనువాదం వ్యక్తిగత కార్యకలాపమే అయినప్పటికీ
సామాజిక వ్యవస్థకూడా, దాని విజయానికి వివిధ స్థాయిలలో, వివిధ రకాల ప్రజలు కలసి, బృందవ్యాపకంగా
కూడా నిమగ్నమవ్వాలసి ఉంది.
ఈ సందర్భంలో జాఅస ప్రత్యేక కార్యకలాపాలను ఆమోదించవలసి ఉంది:
|
|
»
|
పుస్తకాలు ప్రారంభించటంద్వారా, ఉత్సవాలు, పరిశోధన ఉపకార వేతనాలు మరియు బహుమానాలద్వారా
మంచిగుణవంతమైన అనువాదాలను చురుకుగా ఉన్నతించవచ్చు.
|
|
»
|
సహతోడ్పాటు అనువాద పనిని ప్రోత్సహించవచ్చు. అదేవిధంగా, దీర్ఘకాలిక బహుఅనువాదకులు పథకాలను
చేపట్టవచ్చు. అనువాదకులకు వర్కషాపులు నిర్వహించవచ్చు. అనువాదకుల అనుభవాలను, అభిప్రాయాలను
పంచుకోవచ్చు
|
|
»
|
ప్రచురణకర్తలతో తిరిగి కొనుగోలు ఒప్పందాలు, మరియు గ్రంథాలయాలతో అనుసంధానత, మంచి గుణవంతమైన
అనువాదాలకు ప్రారంభ విఫణిని కల్గించే హామి ఇవ్వటం.
|
|
»
|
అనువాద సామగ్రి ఉత్పాదకులకు ప్రచురణకర్తలకు, మధ్య ఇంటర్ఫేస్ ఏర్పాటు చేయటం, కొనుగోలుదారులకు
ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల రెంటికీ కలిపి.
|
|
»
|
వర్తమాన వ్యవహారాల పత్రికలను అనువదించటానికి, ప్రాథమిక దశలో ఆర్థిక సహాయాన్ని అందించటం.
(న్యూ సైన్టిస్ట్, ఎకానిమిక్ అండ్ పొలిటికల్ వీక్లి మొదలైనవి) వీటిని విస్తృతంగా ప్రాంతీయ
భాషలలోనికి వ్యాప్తి చేయవచ్చు.
|
|
»
|
పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో అనువదించిన సామగ్రిని పాఠ్యక్రమంలో చేర్చుకునేటట్లుగా
సలహానివ్వటం. ముఖ్యంగా సాహిత్య అధ్యయనాలలో అన్ని స్థాయిలలో ఇతర భారతీయ భాషలనుంచి అనువాదం
చేసిన వాటిని పాఠ్యక్రమాలలో చేర్చుకోవలసి ఉంటుంది.
|
|
»
|
అన్ని పాఠశాలలోను, కళాశాలలోనూ ప్రత్యేక పుస్తక ప్రదేశాలలోను ( అనువాదసామగ్రితో సంబంధమున్న)
భాషావనరుల కేంద్రాలను కలిగివుండేటట్లుగా సలహా ఇవ్వాలి.
|
|
»
|
ద్విభాషా నైపుణ్యాలను నొక్కి చెప్పటం. తక్కువగా కనిపిస్తున్న, జరుగుచున్న కార్యకలాపాల
సమాచార వ్యాప్తి, మరియు ఉన్నతింపజేవలసి ఉంది. (కర్ణాటక రాష్ట్ర పోలీసు ఆఫీసర్ల పరీక్షకు
అనువాద విభాగం తప్పనిసరివంటివి)
|
|
»
|
అనువదించిన సామగ్రిని చిన్న పట్టణాలు మరియు గ్రామాలలోను ఇతర ప్రభుత్వ పౌర సంఘ సంస్థలకు
గొప్ప తరంగా ప్రవేశాన్ని కల్పించటాన్ని హామీ ఇవ్వాలి. (జాతీయ అక్షరాస్యతా సమితి మరియు
భారత జ్ఞ్యాన్ విజ్ఞాన్ సమితి వంటివి)
|
యంత్రానువాద ఉన్నతి.
కొత్త సాంకేతజ్ఞత కొత్త అవకాశాలను అందిస్తుంది. త్వరితగతిన, భారీ అనువాద సంపుటానికి,
సాపేక్షంగా తక్కువ ధరకు ఇవ్వగలుగుతుంది. ఈ సందర్భంలోని సాంకేతజ్ఞత వృద్ధి మరియు మానవ
వనరుల అంశాలు లీనమైయున్నాయనుకోండి. జాఅస సాంకేతజ్ఞతను ఉపయోగించుకోటానికి సహాయ పడుతుంది.
యంత్రానువాదంలో సాంకేతజ్ఞతా ప్రక్రియకు ఈ కింది తగిన చర్యలు ఆదత్తం చేసుకోవటానికి సహాయపడగలుగుతుంది:
|
|
»
|
అవసరమైన అవస్థాపన సృజనకు హామీ మరియు ముఖ్యంగా డిజిటల్ ఉపకరణాలు, పర్యాయపదకోశం, ద్విభాషా
నిఘంటువులు, అనువాదానికి సాఫ్టువేరు, ధారణ మొదలైనవి. మంచి సామర్థ్యానికి, ప్రతిభావంతమైన
అనువాదానికి తక్షణ అనువర్తనం కలిగి ఉంటుంది.
|
|
»
|
పదవనరులు - ఈ నిఘంటువులు, పదజాలాలు, భాషావిశ్లేషణలు వాక్ సంయోజన ఉపకరణాలు, పదకోశాలు,
పౌనఃపున్య విశ్లేషణలు మొదలైనవి. యంత్రానువాదా వ్యవస్థకి ఇవి తప్పనిసరి సాధనాలు. ఇవన్నీఒకే
సంస్థ చేత సృష్టించబడటం, మరియు నిర్వహించటం అసాధ్యం. దానికి దీర్ఘకాలంలో బహుసంస్థా
తోడ్పాటు అవసరం అవుతుంది. జాఅస “జట్టు పని” నివేదికను ఏర్పాటు చేస్తుంది. ఆన్లైను చర్చలద్వారా,
సమావేశాల ద్వారా పరస్పర సహచర్యం ద్వారా సహకరిస్తుంది.
|
|
»
|
జాఅసకు సంబంధించినంత వరకు వీలైనంత శుద్ధమైన రూపంలో మూలగ్రంథాలు వాటి అనువాదాలు అందుబాటులో
ఉండాలి. రచనా హక్కుల అంశాల విషయంలో కూడా. జాఅస డిజిటల్ సామగ్రి సంపదకు ప్రామాణిక రూపంలోను,
ఎక్స్ఎమ్ఎల్ టాగ్స్తోనూ మరియు డిటిడిలతోను నిర్వహించటానికి హామీ ఇవ్వగలగాలి.
|
|
»
|
ఈ రోజుల్లో అంతర్జాతీయ ధోరణి ఎలా ఉందంటే, మంచి గుణవంతమైన సమాంతర భాషా రచనా సామగ్రిని,
సమలేఖనం, టీకలలో అభివృద్ధిపరచటం, అలాంటి టీక కల్గిన భాషారచనా సామగ్రిని సమలేఖనం, టీకలలో
అభివృద్ధిపరచటం, అలాంటి టీక కల్గిన భాషారచనా సామగ్రిని యంత్ర జ్ఞ్యాన్ సాంకేతిక పరిజ్ఞానం
ద్వారా యంత్రానువాద వ్యవస్థకి పొందుపరుస్తారు. కేవలం సమాచార సంపుటి మరియు కృషి పరిమాణానికి
కావలసింది గట్టి ప్రాథమిక పెట్టుబడులు అవసరం, ఇవి సాధారణ వ్యక్తుల చేత అయ్యేపని కాదు.
ఏదీ ఏమైనప్పటికీ, జాఅస అలాంటి సౌకర్యాన్ని కల్పిస్తూనే కొంత సహాయంచేస్తూ ప్రయత్నాలు
చేస్తుంది.
|
|
»
|
అంతర్భాష ఆధారిత విధానాన్ని అభివృద్ధి పరుస్తుంది. ఇది విశ్వ అనుసంధానాత్మక భాష [యూనివర్సల్
నెట్వర్కింగ్ లాంగ్వేజ్ (యు.ఎన్.ఎల్)] ఐక్యరాజ్యసమితి 1996 లో 15 దేశాలతో దీనిని ప్రారంభించింది.
ఇప్పటికే ఐఐటి బొంబాయి విభిన్న ఉపకరణాలను, సాంకేతకత్వాలను, మరియు వనరులను ఇంగ్లిషు
భారతీయ భాషల మధ్య యంత్రానువాదాన్ని అభివృద్ధిపరచింది. దీనిని సాధారణీకరించవచ్చుకూడా.
|
|
|