|
అనుబంధం– III:
|
జాతీయ అనువాద సమితి ఆకృతి
|
జాఅస సంస్థగా వెసులుబాటు కలిగివుండి, సొంత అవస్థాపన విషయంలోనూ సాపేక్షికంగా చిన్న సమూహం
గలది, కానీ బడ్జెట్ తగినంత కావలసి ఉంది. గుర్తించిన పరిసరాలలో లక్ష్యాలను సాధించటానికి
నిధుల సమర్థత కలిగి ఉండాలి. దీనికి డైరెక్టర్ - జనరల్, 1520 మంది పూర్తికాలిక విద్యా
సిబ్బంది సహాయకులుగా ఉండాలి. మరియు అదే మోతాదు సహాయ సిబ్బందిని కలిగి ఉండాలి. (అకౌంట్స్/ఆడిట్,
గ్రంథాలను, సమాచార, వెబ్ రూపకల్పన మరియు, ముద్రణా నిపుణులు, సంకలన సహాయకులు, సంఘటన
నిర్వహణా సహాయకులు, సాంకేతిక నిపుణులు/విలేఖనకారులు మొదలైనవారు) అనువాదకులు, విద్యావేత్తలు,
ప్రచురణకర్తలు, మొదలైన ప్రతినిధిలు 10 మందితో నిర్ణయం తీసుకునే సమూహం ఉంటుంది. ఆవర్తన
సభ్యత్వంతో (ఉదా-రెండు లేక మూడు సంవత్సరాల పరిధి గలిగి ఇద్దరు సభ్యులు ప్రతి సంవత్సరం
మార్పిడి జరుగుతూనే ఉంటుంది).
జాఅస దృష్టి కేంద్రీకరించేది - సమాచార, అనువర్తనం, శిక్షణ మరియు అనువాదా పరిసరంలో సృజనాత్మకత.
ఇది కేంద్రీకృతమైన రీతిలో పని చేయదు కానీ అనేక స్థాయిలో లీనమవటం అవసరమవుతుంది. స్థానిక,
రాష్ట్రస్థాయిలలో మరియు అనేక రకాల సంస్థలతో సమన్వయం అవసరం అవుతుంది.
ఇది సహకరిస్తూ మరియు వివిధ సంస్థలను సమన్వయపరుస్తుంది. నకిలీ నిరోధించటం, వాహకాలను
సృజించటం, సమీకృతానికి అనుమతించినప్పటికీ అనువాద అభివృద్ధి కార్యక్రమంలో వెసులుబాటు
కలిగి ఉంటుంది. ఇది ప్రభుత్వ సంస్థలను కలుపుకొని ఉంటుంది. అవి: జాతీయ పుస్తకమండలి,
యుజిసి, సాహిత్య అకాడెమి, అనువాద కేంద్రాలు, భారతీయ భాషల కేంద్రీయ సంస్థ, అనువాదంలో
బోధన మరియు పరిశోధనను అందిస్తున్న విశ్వవిద్యాలయశాఖలు, గ్రంథ అకాడెమీలు, ఇతర రాష్ట్రస్థాయి
సంస్థలు ప్రభుత్వ గ్రంథాలయ అనుసంధానాలు మొదలైనవాటివంటివి) ఇవి ఇంకా, ప్రచురణకర్తలను,
దినపత్రికలను, ఇతర మాధ్యమాన్ని సామూహిక సంస్థలను, పుస్తక విక్రేతలను కలుపుకొని ఉంటుంది.
జాఅస బోధకుల విద్యార్థుల తల్లిదండ్రుల, పరిణతి చెందిన నేర్వరుల ఇతర పౌరులను కలుపుకొని
పరస్పర సంబంధాలు కలిగి ఉంటుంది. వ్యూహాత్మక ప్రమేయాలను నిర్మించుకుంటూ వాహకాలను అభివృద్ధి
పరుచుకొంటూ ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు కార్యకర్తలను నిమగ్నం చేస్తుంది.
వ్యూహాత్మక రచనా కారణాలను బట్టి, జాఅస విధిగా రాజ్యాంగ 8వ అధికరణలోని 22 ప్రధాన భాషలను
ఇముడ్చుకొని పని ప్రారంభించటం మంచిదనుకుంటాను - కానీ నిర్వహణ ముఖ్యమైనది, ప్రాంతీయ
భాషలలో ఉత్పాదనకు వ్యాపింపజేయటం మర్చిపోకూడదు.
ఊహించుకుంటున్నదేమిటంటే, జాతీయ అనువాద సమితి ఈ కార్యక్రమాలను ప్రదర్శిస్తుంది. 11వ
ఆర్థిక ప్రణాళికా కాల పరిధిలో స్థాపించవచ్చు. ప్రతిపాదిత బడ్జెట్తో, 250 కోట్లు మొత్తం
ప్రణాళికా కాలానికి (80 కోట్లు సంస్థాపన ఖర్చు, మానవ శక్తి/వనరులు, ఉపకారవేతనాలకు,
170 కోట్లు ఇతర అన్ని కార్యకలాపాలకు - ఇది ఇతర తోడ్పడు సంస్థలకు/పక్షాలకు) 11వ ప్రణాళికా
కాల అనుభవాలపై ఆధారపడుతూ, సహాయాన్ని పెంచుకుంటూ, తదుపరి అధికం చేసుకుంటూ కొంత జాఅసకు
మరొకసారి అదనంగా అవసరమైన అవస్థాపన సామగ్రి సృజించటానికి/అభివృద్ధి పరచటానికి సహాయం
అవసరం అవుతుంది.
జాఅసని సృజించటం అభివృద్ధిపరచటం మానవవనరుల మంత్రిత్వశాఖకి పని అప్పగించవచ్చా? అనే విషయాన్ని
కూడా నిర్ణయించవచ్చు. ప్రత్యేకంగా ఎన్బిటి, పనిచేస్తున్నది దీనికిందే. లాంగ్వేజ్ బ్యూరో
(భాషా కార్యాలయం) విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు, ఎన్బిటి మరియు ఇంకా అనేక భాషాసంస్థలు -
సిఐఐఎల్తో కలిపి దీనిలోకే వస్తుంది. లేక సాంస్కృతిక మంత్రిత్వశాఖ (సాహిత్యం అకాడమీ
దీనికిందే పని చేస్తుంది).
దీనికి వివరణ వృద్ధిచేయటం అవసరం ప్రభుత్వానికి నివేదించే ముందు ఇది ఆమోదించటానికి విలువైన
ప్రతిపాదన. సమాలోచనలతో పాటుగా సంబంధిత మంత్రిత్వశాఖలు (మానవ వనరుల - వనరుల మంత్రిత్వశాఖ
సాంస్కృతిక వ్యవహారాలశాఖ ఐటి) 10 మంది సభ్యుల సంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వారు
దీని ఆలోచనకర్తలుగా ఉంటారు. వారు:
|
1.
|
ప్రొ. బిపన్ చంద్ర - ఎన్బిటి, అధ్యక్షుడు
|
2.
|
ప్రొ.కె. సచ్చిదానందన్ - (కార్యదర్శి/సాహిత్య అకాడెమి) లేక డా. నిర్మల్కాంత్ భట్టాచార్జి (సంపాదకుడు, ఇండియన్ లిటరేచర్ మరియు సభ్యుడు - సాహిత్య అకాడెమి)
|
3.
|
ప్రొ. ప్రమోద్ తల్గేరి (మాజీ ఉపకులపతి, సిఐఇఎఫ్ఎల్, ప్రస్తుతం జెఎన్యులో ఉన్నారు)
|
4.
|
ప్రొ. ఇంద్రనాథ్ చౌధురి (హిందీ పూర్వం ప్రొఫెసర్ - ఢిల్లీ విశ్వవిద్యాలయం, నిర్దేశకులు నెహ్రు సెంటర్ మరియు సెక్రటరి, సాహిత్య అకాడెమి)
|
5.
|
ప్రొ. యుఆర్. అనంతమూర్తి (పూర్వ అధ్యక్షుడు సాహిత్య అకాడెమి, ఉపాధ్యక్షుడు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం లేక గిరీష్ కర్నాడ్ (పూర్వ - నిర్దేశకుడు, నెహ్రూ సెంటర్)
|
6.
|
ప్రొ. అమియా దేవ్ లేక (ప్రొ. నవనీతదేవ్ సేన్ (ఇద్దరూ పూర్వం - తులనాత్మక అధ్యయశాఖలో ప్రొఫెసర్లు, జాదవ్పూర్ విశ్వవిద్యాలయం)
|
7.
|
ప్రొ. ఎస్.బి. వర్మ (జపనీస్ భాష పూర్వ ప్రొఫెసర్, జెఎన్యు అనువాదకునిగా సుపరిచితులు.
|
8.
|
ప్రొ. హరీష్ త్రివేది, ఇంగ్లిషుశాఖ, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
|
9.
|
ప్రొ.పుష్పక్ భట్టాచార్య (ఐఐటి ముంబై)
|
10.
|
ప్రొ. ఉదయనారాయణ సింగ్ (నిర్దేశకులు, సిఐఐఎల్ - మైసూరు - సమన్యయ కర్త)
|
|
|
|
|