|
జరుగుచున్న ప్రయత్నాలు
మార్గదర్శక పథకం: ‘అనుకృతి’
|
ప్రణాళికా సంఘం ఇప్పటికే భారీ పథకాన్ని అనువాద పరిసరంలో భారతీయ భాషల కేంద్రీయ సంస్థ
సి.ఐ.ఐ.ఎల్., మైసూరుకు ‘అనుకృతి’ పేరున మంజూరు చేసింది. అనువాద వెబ్సైట్ పేరు “అనుకృతి:
ట్రాన్స్లేటింగ్ ఇండియా”. ఇది అనువాద సేవ మరియు అన్ని భారతీయ భాషలలో సమాచారం కల్గి
ఉంటుంది. ఈ రీతిగా వెబ్సైట్ సృజించబడడానికి, భారతీయ భాషల కేంద్రీయ సంస్థ (ఎమ్.ఎచ్.ఆర్.డి.,)
మైసూరు, సాహిత్య అకాడెమీ, జాతీయ పుస్తక మండలి, కొత్త ఢిల్లీ కలసి భారతీయ భాషలను అభివృద్ధి
పరచటానికి, ఈ మూడు సంస్థలు సమర్పించుకొని పనిచేశాయి.
|
10వ ప్రణాళికా కాలంలో ఈ పథకానికి మొత్తం 59.64 లక్షలు కేటాయించబడ్డాయి. అనుకృతి పథకం
క్రింద ప్రణాళిక కల్గి ఉన్నది; సాధించినవి ఇవి:
|
|
»
|
అనువాద వెసులుబాటు కలిగిన వెబ్సైట్ www.anukriti.net
అనుకృతి ఆరంభించబడింది. ఇన్ని సంవత్సరాలు కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధిపరుస్తూ విలేఖనం
చేశాం.
|
|
»
|
మూడుసంవత్సరాల సంచికలు గల ఆన్లైన్ అనువాద పత్రిక “ట్రాన్స్లేషన్ టుడే” ఇప్పటివరకు తీసుకొని
వచ్చాం.
|
|
»
|
అనువాదకుల సమాచారనిధి అనువాదకుల జాతీయ జాబితా క్రమంగా వృద్ధిపరుస్తున్నాం.
|
|
»
|
ఇంగ్లిష్ - కన్నడ యంత్రసహాయక అనువాద ప్యాకేజికి ప్రాథమిక కార్యం చేశాము.
|
|
»
|
ప్రధాన ప్రచురణ సంస్థల నుండి అనువాద ప్రచురణలు పొందుకొని అనువాద పట్టిక తయారుచేశాం.
|
|
»
|
అనువాదం పైన మన దేశంలోనూ విదేశాలలోను అందిస్తున్న వివిధ పాఠ్యక్రమ వివరాలను సైటులో
అందుబాటులో ఉంచటం.
|
|
»
|
వృత్తిరీత్యా అనువాద సంస్థలన్నిటికి అనుసందాయకత కలిగి ఉన్నాం.
|
|
»
|
ఆన్లైన్ అనువాదకుల సౌకర్యాలకోసం వివిధ రకాల అనువాద సాఫ్టువేర్లను కొనుగోలు చేయటానికి
ఆన్లైన్లో సంబంధాల అనుసందాయకాన్ని కలిగి ఉన్నాయి.
|
|
»
|
నిఘంటు పరిభాష, ఉపయుక్త గ్రంథసూచి, అనువాద అధ్యయనాలకు సంబంధించినవి పూర్తవటానికి దగ్గరలో
ఉన్నాయి.
|
ఎన్.సి.ఇ.ఆర్.టి. చేసినపని
|
ఎన్.సి.ఇ.ఆర్.టి. హింది మరియు ఉర్దూ భాషలలోకి 12వ తరగతివరకు అన్ని పుస్తకాలన్ని అనువాదం
చేసింది. అది మొట్టమొదటిసారిగా జాతీయ/పాఠ్యక్రమ చట్టపరిధిలో (ఎన్.సి.ఎస్) లు 8వ అధికరణలోని
22 భారతీయ భాషలను అనువాదం చేసింది. జాఅస అధికరణలోని అన్ని భారతీయ భాషలను అనువాదం చేయడానికి
సహాయం చేయవచ్చు.
|
భారతదేశంలో అనువాదాల ప్రచురణలు
|
1954 లో సాహిత్య అకాడెమీ, 1957 లో జాతీయ పుస్తక మండలి స్థాపించబడినాయి. ఇవి మొట్ట మొదటి
ప్రభుత్వరంగ అనువాద ముద్రణా విభాగాలు, వాటి ప్రచార కార్యకలాపాలలో భాగంగాను, భారతదేశంలోని
విభిన్న సామాజిక, ప్రాంతీయ, భాషాపరమైన ఖాళీలు లేకుండా చేయటానికి అనువాదం ద్వారా వంతెనల
నిర్మాణానికి కృషి చేస్తున్నాయి.
ఆరంభం నుండి కూడా సాహిత్య అకాడెమీ సాహిత్యగ్రంథాల అనువాదాలను ప్రాంతీయ భాషలలోను మరియు
ఇంగ్లిషు నుండి ఇతర ప్రాంతీయ భాషలలోనికి అనువాదం చేస్తుంది. ఇది 24 భాషలలో 7,000 గ్రం
థాలను అచ్చువేసింది. అకాడెమీ గుర్తించిన భాషలో మాత్రమే అనువాదాలు అచ్చువేసింది. కానీ
ప్రత్యేక గిరిజన సాహిత్యం పథకం ద్వారా, మొదట ఇది బరోడాలోను ప్రస్తుతం షిల్లాంగ్లో ఉంది.
అది గిరిజన భాషలలోనూ, మాండలికాలలోనూ ముఖ్యంగా గద్వాలి, భిలి, కుయి, గరొ, గమిత్, మిజో,
వెప్పా, పహరి, ముండాలి, గొండి మొదలైనవి. దాని ముఖ్య అంతర్భాషా అనువాద పరిసరాలలో పనిచేస్తూ
రచనలను అందిస్తుంది.
జాతీయ పుస్తక మండలి ‘ఆదాన-ప్రధాన’ సంకలనాలకు సమకాలీన కావ్యాలను 8వ అధికరణలోని వివిధ
భాషలనుండి ఇంగ్లిషులోనికి ఇతర భారతీయ భాషలోనికి అనువదిస్తారు. ఏదీ ఏమైనప్పటికీ, మండలి
కార్యకలాపాలు సాహిత్యానికి మాత్రమే పరిమితమైయుండలేదు; అది జ్ఞాన గ్రంథాలను పౌరహక్కులు
ఆరోగ్యం, పర్యావరణం కళ, భవననిర్మాణం, రాజనీతి శాస్త్రం, చరిత్ర మొదలైనవి. వీటితోపాటుగా
ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు, భిన్న జీవిత సంఘటనలతో కలిపి సంకలనాలను పరంపరను అచ్చువేశాయి.
భారతీయ ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరచిన తరువాత, ఎనభైలలో, అంతర్జాతీయ ప్రచురణ సంస్థల
దృష్టిని ఆకర్షించి, 80% ఇప్పటికీ విద్యయుత విషయాలను ఇంగ్లిషులో అచ్చువేస్తున్నప్పటి,
భారతదేశంలో అచ్చు వేయటం మొదలు పెట్టారు. ఈ పరిశ్రమ వృత్తిపరంగా మరింతగా బలపడుతుంది.
సంకలన ప్రమాణాలు పైపైకి ఎదుగుతున్నాయి. విఫణి పైన మరెక్కువ దృష్టి నిలుపుతున్నారు.
పియర్సన్ ఎడ్యుకేషన్, రాండమ్హౌస్, సేజ్, మాక్గ్రాహిల్ వంటి మొదలైనవారు విద్యారంగం పైన
దృష్టి నిలిపారు. విశాల దృక్పథంలో ఆలోచనచేస్తే ఓరియంట్ లాంగ్మన్ (దిష సంకలనాలు) మాక్మిల్లన్
ఆధునిక నవలల ఇంగ్లిషు అనువాదాల పరంపర) పెంగ్విన్ ఇండియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్,
రూపాకో, హర్పర్ కోల్లిన్స్ మొదలైనవి. అనువాదాల విషయంలో ఎంతగానో ఆకర్షితులైనాయి. మరొక
సంప్రదాయంకూడా పరిణమిస్తూ ఉంది. కథవంటి వాటి అనువాద విషయాలలోని మగ్నమై ఉంటున్నాయి.
చిన్న చిన్న ప్రచురణకర్త స్త్రీ, జుబాన్, రోలి, ఉమెన్ అన్ లిమిటడ్, మొదలైనవి కూడా అనువాద
విషయాలలో ఆసక్తి చూపుతున్నాయి.
ఇంగ్లిషు సాహిత్య అనువాద చిత్రాన్ని కలిగివున్నప్పటికీ, అన్నీ అంత వెలుగుని చూడలేదు.
మనం ఆలోచించినట్లయితే (i) ఇతర వర్గాలలోని పుస్తకాలను ఇంగ్లిషులోనికి అనువాదం (ii) ఇంగ్లిషు
నుండి భారతీయ భాషలలోనికి అనువాదం భారతీయ భాషములనుండి ఇతర భారతీయ భాషలలోనికి (iii) భారతీయ
భాషల మధ్య అనువాదం మరియు అసమతుల్యంగా ఉదాహరణకు 260 బెంగాలి గ్రంథాలు మలయాళ భాషలో లభ్యమవుతున్నాయి.
కేవలం 12 పుస్తకాలే మలయాళం నుంచి బెంగాలీ భాషలలోనికి అనువదించబడినాయి. ఈ అసమతుల్యతకు
ఒక కారణమేమిటంటే, బహిర్గతం చేసుకోవటం లేక మూసుకుపోతున్న స్థితి కలిగిన భాషా స్థితి,
కొన్ని భాష నుండి మరికొన్ని భాషలకు అనువాదకుల మాన్యత కూడా. అనేక భాషలకు ఇంగ్లిషులోనికి,
ఇంగ్లిషు నుండి ఆధునిక భారతీయ భాషాలలోనికి నిపుణులు ఉన్నప్పటికి కొన్ని భారతీయ భాషలకు
తమిళ్ మరియు మరాఠి, మలయాళం మరియు గుజరాతీ వంటి భాషలకు అనువాదకులు లేరు.
|
పాఠ్యక్రమాలు
|
నియత పాఠ్యక్రమాలు ప్రస్తుతం కొన్ని విశ్వవిద్యలయాలు మాత్రమే అందిస్తున్నాయి. ప్రస్తుతం
ఈ పాఠ్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి.
|
1.
|
అన్నామలై విశ్వవిద్యాలయం:
|
|
|
(i)
|
పి.జి. డిప్లొమా/అనువాద అధ్యయనాలు
|
|
(ii)
|
ఎమ్.ఎ. లో అనువాద మరియు అనువర్తిత భాషాశాస్త్రం
|
|
(iii)
|
ఎమ్.ఎ లో అనువాద అధ్యయనాలు
|
|
(iv)
|
భాషశాస్త్రం లో పి.ఎచ్.డి. (అనువాదాలు చేర్చి)
|
|
(v)
|
అనువాద అధ్యయనాలు లో ఎమ్.ఫిల్.
|
2.
|
ఆగ్రా విశ్వవిద్యాలయం, కె.ఎమ్. ఇన్స్టిట్యూట్: అనువాదంలో డిప్లొమా కోర్సులు
|
3.
|
హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం: అనువాద అధ్యయనాలలోఎమ్.ఫిల్.
|
4.
|
పండిట్. రవిశంకర్ శుక్ల విశ్వవిద్యాలయం: అనువాదంలో సర్టిఫికేట్ కోర్సు
|
5.
|
స్వామి రామానంద్ తీర్థ్ మరథ్వాడా విశ్వవిద్యాలయం: అనువాదంలో సర్టిఫికేట్ కోర్సు
|
6.
|
పూనె విశ్వవిద్యాలయం అనువాదంలో సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సు
|
7.
|
హైదరాబాద్ విశ్వవిద్యాలయం (దూరవిద్య కేంద్రం) అనువాద అధ్యయనాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్
డిప్లొమా (పి.జి.డి.టి.ఎస్).
|
8.
|
హైదరాబాద్ విశ్వవిద్యాలయం (హిందీ శాఖ):
|
|
(i)
|
అనువాదంలో డిప్లొమా కోర్సు
|
|
(ii)
|
వృత్తి రీత్యా అనువాదంలోఅడ్వాన్స్డ్ డిప్లొమా
|
|
(iii)
|
అనువాద అధ్యయనాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
|
9.
|
హైదరాబాద్ విశ్వవిద్యాలయం; (సి.ఎ.ఎల్.టి.ఎస్.) అనువాద అధ్యయనాలలో ఎమ్.ఫిల్ మరియు పి.ఎచ్.డి.
|
10.
|
సి.ఐ.ఇ.ఎఫ్.ఎల్. (ఇప్పుడు టి.ఇ.ఎఫ్.ఎల్.యు.), హైదరాబాదు) అనువాద అధ్యయనాల కేంద్రం (అఅకే)
అనువాద అధ్యయనాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
|
11.
|
కేరళ విశ్వవిద్యాలయం : అనువాద అధ్యయనాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
|
12.
|
మధురై విశ్వవిద్యాలయం: అనువాదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
|
13.
|
తమిళ్ విశ్వవిద్యాలయం, తంజావూర్: అనువాదంలో డిప్లొమా కోర్సులు
|
14.
|
విశ్వ –భారతి: ఎం.ఎ. ప్రాయోగిక హింది (అనువాదం)
|
పైవాటితో పాటుగా విశ్వవిద్యాలయాలలోని అనేక తులనాత్మక అధ్యయన శాఖలు (జాదవ్పూర్ విశ్వవిద్యాలయం
వీర్ నర్మద్ సౌత్ గుజరాతి విశ్వవిద్యాలయం, సూరత్) అనువాద అధ్యయనాల విభాగంలో ఇవి కూడా
పాఠ్యక్రమాలన్ని అందిస్తుంది. ప్రైవేటుసంస్థలు కూడా ఈ క్రింది పాఠ్యక్రమాలను అందిస్తున్నాయి:
డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ స్టడీస్. బెంగుళూరు అలాంటివి
అనేకం ఇప్పుడు లభ్యమవుతున్నాయి.
|
భారతీయ భాషలకు- భాషా
సమాచార సహవ్యవస్థ (భా.స.స-భా.భా)
|
భాసస-భాభా భారతీయ భాషలలో భాషా సాంకేతజ్ఞత భాషా శాస్త్ర రచన సామగ్రి పైన కృషి చేసి పరిశోధకులకు
వృద్ధిదారులకు ఉపయోగపడేందుకు దీన్ని ఏర్పాటు చేశాం. భాషా సాంకేతజ్ఞత వృద్ధిచేయటానికి
ఈ భాషాసామగ్రి కీలకపాత్ర వహిస్తుంది. భాససభాభా యంత్ర పఠనా సమాచారాన్ని హిందీ, ఇతర భాషల
సమాచారాన్ని అభివృద్ధిపరచవలసింది. సమాచార సేకరణ ప్రక్రియ, పరిమాణాలలో (2) ఉన్న భాషాసామగ్రికి
వివరణ ఇవ్వటం. అనేక శాస్త్రాలకు నిమగ్నం చేయాల్సిన అవసరం ఉంది. భాషా శాస్త్రం గణాంక
శాస్త్రం సాంకేతిక రంగాలలో వంటివి. భారతీయ భాషల భాషా సమాచార సహ వ్యవస్థకు అదనంగా ఈ
కిందివి కలిగి వుంటుంది.
|
|
»
|
భాషా వనరుల నిధి అన్ని భాషలలో పాఠం, వాక్కు, పదరచనాసామగ్రిని సృజించటం.
|
|
»
|
వివిధ సంస్థలు అలాంటి సమాచార నిధిని కలిగి ఉంటే వాటికి కావలసిన సౌకర్యాలను కలుగ జేయటం.
|
|
»
|
భాషారచనా సామగ్రి నిక్షిప్తం చేయటానికి సమాచార సేకరణకు ప్రమాణాలను నెలకొల్పి, భిన్న
పరిశోధక మరియు అభివృద్ధి కార్యకలాపాలు చేయవచ్చు.
|
|
»
|
నిర్వహణ మరియు సమాచార సేకరణకు ఉపకరణాలు కలిసి పనిచేయటం, అభివృద్ధిపరచుకొనటం.
|
|
»
|
వర్కుషాపులు, సదస్సులద్వారా శిక్షణా సౌకర్యాలు, సాంకేతిక, ప్రక్రియా సంబంధ అంశాలలో.
|
|
»
|
భాసస-భాభా వెబ్సైట్ సృజించి, నిర్వహించటం, భాసస-భాభా వనరులను దర్శించటానికి అది ప్రాథమిక
ప్రధాన ద్వారం.
|
|
»
|
ప్రజల వినియోగార్థం సరైన భాషాసాంకేతజ్ఞత రూపకల్పన చేసి సృజించటం, లేక అందించటం
|
|
»
|
వైయుక్తిక పరిశోధకులతో, విద్యాసంస్థలతో అవసరమైన అనుసంధాయకతలను కలిగి వుంటడం ఈ కార్య
కలాపాలన్నీ యంత్రానువాదానికి సౌకర్యాన్ని కలుగజేస్తాయి.
|
|
అనువాద సమితికి నేరుగా ఉపయోగపడతాయి. భాషా వనరుల నిధి అన్ని భాషలలో పాఠం, వాక్కు, పదరచనాసామగ్రిని
సృజించటం.వివిధ సంస్థలు అలాంటి సమాచార నిధిని కలిగి ఉంటే వాటికి కావలసిన సౌకర్యాలను
కలుగ జేయటం.
|
సి-డి.ఎ.సి మరియు టి.డి.ఐ.ఎల్. చేసినపని
|
సి.డి.ఎసి మరియు టి.డి.ఐ.ఎల్. యంత్రానువాద వ్యవస్థ సామర్థ్యాన్ని అనుమానించే సంశయవాదులు
కూడా చుట్టు పక్కల ప్రపంచంలో ఉపయోగపడుతున్న యంత్రానువాద వ్యవస్థలను చూసి ఆశ్చర్యపడుతున్నారు.
ఉదాహరణలకు సిస్ట్రాన్ (ఆల్టావిస్టా సర్చ్ ఇంజను) మరియు ఎమ్.ఇ.టి.ఇ.డి. (కెనడియన్ మెటలర్జికల్
సెంటర్లో ఉపయోగిస్తున్న 45,000 పదాలకు పైగా వాతావరణ సంచికలకి సంబంధించి 1977 నుండి
అనువాదం చేస్తుంది.) భారతదేశంలో సి-డిఏసి తో యంత్రానువాద విప్లవం ఆరంభమైంది. నాచురల్
లాంగ్వేజ్ ప్రొసెసింగ్ (ఎన్.ఎల్.పి.) మరియు ఒక టాగ్ ఆధారిత పార్సర్ అభివృద్ధిపరచారు.
హిందీ సంస్కృతం, గుజరాతీ, ఇంగ్లిషు మరియు జర్మన్ భాషలకు ఈ సాంకేతజ్ఞత అభివృద్ధిపరస్తున్నప్పుడు,
ఆ సంస్థ ప్రయోగాత్మక ఆచరణ కోసం ఎదురు చూస్తూ ఉంది. దాన్నే వివిధ సంస్థలకు సలహా యిచ్చారు.
యంత్రానువాదంతో అత్యుత్తమ సామర్థ్యాన్ని ఇచ్చేది ఉంది. అధికార భాషా శాఖ (అ.భా.శా) భారత
ప్రభుత్వం, చురుకుగా పథకాలకు నిధులను ఇవ్వటం ప్రారంభించాయి. ప్రసార మరియు సమాచార సాంకేతజ్ఞత
మంత్రిత్వ శాఖ (ఎమ్.సి&ఐ.టి.) క్షేత్ర ప్రత్యేక అనువాద వ్యవస్థలన్ని అభివృద్ధి పరచటానికి
ఈ కిందివాటిని గుర్తించింది.
|
|
»
|
ప్రభుత్వ కార్యనిర్వహణా వ్యవహారాలు - రచనలు
|
|
»
|
పార్లమెంటు ప్రశ్నలు మరియు జవాబులు, ఔషధ నిర్మాణ సంబంధ సమాచారం
|
|
»
|
న్యాయ పరిభాష మరియు తీర్పులు
|
ఇంకా మంత్రిత్వశాఖ “భారతీయ భాషలకు సాంకేతజ్ఞతం అభివృద్ధి” చేయటానికి ప్రయత్నించింది.
ఈ పథకం 1990-91 లో పరిశోధనా మరియు అభివృద్ధికి (ప మరియు అ) యంతానువాదంతో పాటు భారతీయ
భాషలో సమాచారాన్ని సమకూర్చారు. ఏదీ ఏమైనప్పటికీ, 22 అధికార భాషలకు అనువాదం ఒక సంక్లిష్ట
సవాలు విసిరింది. హిందీ మరియు ఇంగ్లిషు సంకటాత్మక భాషల జంట, ప్రభుత్వ కార్యాలయాలలో
ఉత్తరప్రత్యుత్తరాల సముదాయం అనువదించటానికి ఈ భాషల జంట యంత్రానువాదానికి ప్రాధాన్యత
నిచ్చారు.
ఆ విధంగా రెండు ప్రత్యేక పరిశోధనా పరిసరాలను ఎంపిక చేశారు. యంత్రానువాద వ్యవస్థలు -
భారతీయ భాషల మధ్య, మరియు యంత్రానువాదాలు ఇంగ్లిషు నుండి హిందీలోనికి. ప్రస్తుతం, మూడు
సంస్థలు మనదేశంలో సి-డిఎసి పూనె, ఎన్.సి.ఎస్.టి., లేక ప్రస్తుతం సి-డిఎసి ముంబై, ఐ.ఐ.ఐ.టి.,
- హైదరాబాద్ మరియు ఐ.ఐ.టి., కాన్పూర్లలో వృద్ధి మరియు అనువర్తనలతో సాంకేతజ్ఞతలలో ముందున్నారు.
ప్రస్తుతం కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇది అత్యున్నత ప్రదర్శన నిచ్చేది.
జ్ఞాన ఆధారిత కంప్యూటర్ వ్యవస్థల పథకం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ (డి.ఓ.ఇ.,),
సి - డిఎసి ‘వ్యాకర్త (VYAKARTA) అభివృద్ధిపరచారు. అది ఇంగ్లిషు, హిందీ, గుజరాతీ, సంస్కృత
భాషలకు పనిచేస్తుంది. అదే పార్సరును ఉపయోగించి మంత్ర (MANTRA) యంత్ర సహాయక అనువాద ఉపకరణం
తయారుచేశారు. అది అధికార భాషా వాక్యాలను అనువాదం చేయటానికి అభివృద్ధిపరిచారు. ఈ పథకానికి
విత్త సహాయం చేసిన అధికార భాషా శాఖకు ప్రదర్శించారు. కార్యనిర్వాహణ అవసరాల కోసం ఇంగ్లిషు
నుండి హింది భాషలోనికి “యంత్ర సహాయక అనువాద వ్యవస్థన”ను వృద్ధిచేశారు. ఈ పథక లక్ష్యం
రూపకల్పన, అభివృద్ధి మరియు ఆచరణ వ్యక్తిగత కార్యనిర్వహణ కోసం యంత్రసహాయక అనువాద వ్యవస్థ.
ఈ వ్యవస్థ ఇప్పుడు ఉత్తరాలను అనువదించగలగటం, ఉదా:-నియామక ఉత్తర్వులు మరియు బదిలీలు
డిటిపి ప్యాకేజీలు మరియు ప్రమాణిక పద ప్రక్రియద్వారా కావలసిన సమాచారాన్ని తీసుకోగల
సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఇంగ్లిషు నుంచి హిందీలోనికి అనువాదం పైన చెప్పిన క్షేత్రంలో విజయవంతంగా పూర్తి చేసిన
తరువాత, సి-డిఎసి - దానిని ఇప్పుడు ఇతర క్షేత్రాలు, భాషా అనువాదానికి మెళకువలన్ని వృద్ధిపరుస్తూ
వర్తింపజేస్తుంది. ఈ సామర్థ్యం ఏ భాషా జంట మధ్యనైనా యంత్రానువాద సాధించే సామర్థ్యాన్ని
కలిగి వుంటుంది.
ఈ యంత్రానువాద పరిసరంలో లీనమైన ముంబై ఆధారిత ఎన్.సి.ఎస్.టి. ప్రస్తుతం దీనినే సి-డిపి
ముంబై అంటున్నారు. ఎన్.సి.ఎస్.టి. భారతదేశంలో యంత్రానువాదంపై పని చేసిన మొట్టమొదటి
సంస్థలలో ఒకటి. 80 ల తొలిదశలో స్క్రీన్టాక్ అనే మౌలిక రూపాన్ని వృద్ధిపరచారు. ఇది పి.టి.ఐ.
వార్తాలను, కొన్ని వర్గాల కథలను లిపి వంటి ధాతువు విధానాన్ని కలిగి ఉంది. అప్పటి నుంచి
అది మరొక సాఫ్టువేరు తయారు చేసింది దానిపేరు మాత్ర (MaTra).ఇది సాధారణ ప్రయోజనాలనుద్దేశించి
ఇంగ్లిషు-భారతీయ భాషల మధ్య అనువాదాన్ని చేయటానికి రూపకల్పన చేసినది, హిందీతో ప్రారంభించబడినది.
మాత్ర MaTra రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. స్వయంచాలన విధానంలో అది ఇవ్వగలిగినంత అత్యుత్తమ
అనువాదాన్ని ఇస్తుంది. తరువాత ఉపయోగించుకోవడం ద్వారా పరసంకలనం చేయవలసి ఉంటుంది. మానవ
జోక్యం విధానాలలో ఉపయోగించుకొనేవారు వ్యవస్థకి సరైన అనువాదం కోసం తమ సొంత జ్ఞానాన్ని
ఉపయోగించి మార్గ నిర్దేశం చేయవచ్చు
కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అభివృద్ధి చేయటంలో, ఐ.ఐ.టి., ముంబై మరియు ఐ.ఐ.టి., కాన్పూరు
అనుసారక, ఆంగ్లభారతి, అనుభారతి మొదలైన పథకాలద్వారా ముందున్నాయి. ప్రస్తుతం, ఈ సమస్యకు
అత్యంత ఆధునిక విధానం ద్వారా విశ్వ అనుసంధాయిక భాష ( అ వి భా ) ను ఐఐటి ముంబై అన్వేషిస్తుంది.
ANGLABHARATI యంత్రానువాదం పరిసరంలో ఒక విప్లవాత్మకమైన వ్యవస్థగా పరిణమిస్తుంది అంటున్నారు.
ఈ వ్యవస్థ యంత్ర సహాయక అనువాద వ్యవస్థలు ప్రజారోగ్య, ప్రచార ప్రత్యేక క్షేత్రానికి
సంబంధించినది.
ప్రస్తుత పథకాలన్నీ వాటి శక్తినంతా ఇంగ్లిషు నుంచి హిందీ భాషలపైన మాత్రమే దృష్టినిలుపుతూ
ఇతర భాషలకు దానిని పొడిగించటం ఒక సవాలుగా ఉంది. అనుసారక పథకం ఐఐటి-కాన్పూరులో ప్రారంభించబడి
తదనంతరం, ఐఐఐటి - హైదరాబాదు, సి.ఎ.ఎల్.టి.ఎస్., యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు విస్తృతంగా,
నవ్యదృక్కోణంలో, అనువాదంపై గురి నిలిపి, ఒక భారతీయ భాషనుండి మరొక భారతీయ భాషలోనికి
తీవ్ర కృషి చేశారు. అనుసారక సాఫ్టువేరు ఒక భారతీయభాష నుండి మరొక భారతీయ భాషలోనికి పాఠాన్ని
మార్పిడి చేస్తుంది. అది ఉత్పాదకాన్ని ఇస్తుంది. దానిని పాఠకుడు/రాలు అర్థం చేసుకోగలుగుతారు.
కాని ఖచ్చితంగా వ్యాకరణంలో ఉన్నట్లు కాదు. ఉదాహరణకు బెంగాలీ నుంచి హిందీ అనువాదకు ఒక
బెంగాలీ పాఠాన్ని తీసుకొని ఉత్పాదన ఇచ్చినప్పుడు హిందీలో ఉన్న ఉత్పాదన ఒకరు దానిని
అర్థంచేసుకోగలుగుతారు కాని వ్యాకరణరీత్యా అంత సరిగా ఉండదు. అదే విధంగా ఒక వ్యక్తి ఆ
సైటుని సందర్శించినప్పుడు, ఆయనకు తెలియని భాషను కూడా అనుసారక ద్వారా పని చేసి పాఠాన్ని
చదువుకోగలుగుతాడు. అనుసారక తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠి మరియు పంజాబీ నుండి హిందీలోనికి.
ఈ విధంగా రూపొందించిన వ్యవస్థ బాహ్యవనరుల సాఫ్టువేరు అందుబాటులో ఉంది. ఇది ఐఐఐటి -
హైదరాబాదు మరొక అనువాద సహాయక వ్యవస్థలో ముందుకు వచ్చింది దాని పేరు శక్తి.
ఒకరు గ్రహించేదేమిటంటే, ఇంకా పరిశోధకులు, ఐ.ఐ.టి.,లు సాఫ్టువేరు పరిశ్రమలు తీవ్రంగా కృషి చేయవలసిన పనిపరిసరం ఎంతో వుంది. దానికి జాఅస సహాయం ఎంతైనా అవసరముంది.
|
|
|