|
సాంకేతజ్ఞతా అంశాలు
భారతీయ భాషలకు సంబంధించి ఎలక్ట్రానిక్ అనువాద పరికరాలు ప్రాథమిక దశలో ఉన్నాయి. పద ప్రక్రియకాలు,
నిఘంటువులు, నిర్వాహక ఉపకరణాలు, పరిభాషాపదనిక్షేపాలు, ఆన్లైన్ నిఘంటువులు, ఆన్లైన్
మరియు దృశ్య పర్యాయ పదకోశాలు, పదశోధనిలు, అనువాదధారణ సాఫ్టువేర్లు, ఈ అనువాదకులు యంత్రానువాద
సాఫ్టువేర్లు, అనువాద బోధనా సాఫ్టువేర్లు, పదకోశాలు రచనా సామగ్రి, స్పెల్చెక్కర్లు,
గ్రామర్ చెక్కర్లు, ఎలక్ట్రానిక్ నిఘంటువులు, సాంకేతిక పరిభాష, వ్యాకరణ పరిభాష, ఆన్లైన్
ఉపకరణాలు, సాంస్కృతిక పదాల వివిధ సౌకర్యాలను పొందీ అవసరాల కోసం. యంత్రానువాద ప్యాకేజి
తప్ప, అన్ని కూడా అనువాదకునికి మద్దత్తునివ్వడానికి మాత్రమేగాని వాస్తవ అనువాద లక్ష్యానికి
కాదు.
జాఅస యంత్రానువాదంలో సాంకేతజ్ఞతా పురోగతి తెలుసుకునే సౌకర్యాలను కలిగి ఉండి, శిక్షణకు
మరియు మానవ, సాంకేతిక వనరుల అభివృద్ధికి, కొన్ని కార్యకలాపాలకు, ఇతరులతో కలసి పని చేస్తూ,
సహాయపడుతూ వాహకంగా ఉంటుంది. సి-డి ఎసి భారతీయ భాషలలో సాంకేతజ్ఞతా అభివృద్ధి (భాభాస
వంటి సంస్థలతో జాఅస కలిసి పనిచేస్తూ ఈ కింది పరిసరాలలో సహాయపడుతుంది.
|
అ.
|
కావలసిన వసతులను నిర్మించటం, ముఖ్యంగా డిజిటల్ ఉపకరణాలు పర్యాయపదకోశాలు, ద్విభాషా నిఘంటువులు
అనువాదధారణకు సాఫ్టువేరు వీటికి ముందుగా ప్రభావవంతమైన అనువాదం చేయటానికి తక్షణ అనువర్తనను
కలిగి వుంటుంది.
|
ఆ.
|
పద వనరుల సృష్టి మరియు నిర్వహణ. ఉదా:- ఈ నిఘంటువులు, పదజాలాలు, భాషావిశ్లేషణ సంశ్లేషణ
ఉపకరణాలు, పదకోశాలు, పౌనఃపున్య విశ్లేషణలు, వంటివి సంస్థల సహకారంతో దీర్ఘ కాలంలో సాధించేవి.
జాఅస జట్టుగా కల్గి పని చేయటానికి కావలసిన స్థానాన్ని కల్పిస్తుంది -నిరంతర చర్చలు,సమావేశాలు,
ఆన్లైన్ చర్చల ద్వారా సహకరిస్తుంది.
|
ఇ.
|
మూల రచనలకు మరియు అనువాదాలకు రచనా హక్కుల విషయంలో స్పష్టమైన డిజిటల్ పత్రిని కలిగివుండేటట్లు
పనిచేస్తుంది. జాఅస డిజిటల్ సమాచార సంపద ఒక ప్రామాణికరూపంలో ప్రామాణికతగల్గిన ఎక్స్.ఎమ్.ఎల్.
టాగ్స్, డి.టి.డి.ల ద్వారా భద్రపరచే హామి/ఇస్తుంది.
|
ఈ.
|
ఎల్.డి.సి.ఐ.ఎల్. పథకం కింద ఉన్నత గుణంగల సమాంతర రచనా సామగ్రి వివరణ, సమలేఖనాల ఉత్పత్తి,
నిర్వహణ జరుగుతుంది. అటువంటి రచనా సామగ్రిని, యంత్రజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని
యంత్రానువాద వ్యవస్థను పొందుకోవచ్చు.
|
ఉ.
|
విశ్వ అనుసంధాయక భాష (వి.అ.భా.) విధానంలో అంతర్భాషా పద్ధతిద్వారా ఉన్నతి చేయటం,
ఈ విషయం పై, ఐక్యరాజ్యసమితి 1996లో పూనుకొన్న పథకం కింద 15 దేశాలను లీనంచేస్తూ పనిచేస్తుంది.
ఐఐటి బొంబాయి ఇప్పటికే అనేకరకాల ఉపకరణాలు, పరిజ్ఞానాలు, ఇంగ్లిషు మరియు భారతీయ భాషలో
యంత్రానువాద వనరులు తయారుచేసింది. వీటిని ఇంకా అనేకమైనవాటిని సాధారణీకరించవచ్చు.
|
|
|
|