సందర్భం

ప్రధానమంత్రి వ్యాఖ్య
ఈ జాతీయ అనువాద సమితి ఆలోచన మొట్టమొదటగా భారతదేశ ప్రధానమంత్రిగారి నుంచి వచ్చింది. వివిధ సంక్లిష్ట రంగాలలో పెరుగుతున్న జ్ఞాన ప్రవేశ అవసరాల దృష్ట్యా అనువదించిన సామగ్రిని అందుబాటులోకి తెచ్చుకోవడం ఎంతో ప్రాణాధారమైనదని జాతీయ జ్ఞాన సంఘం మొదటి సమావేశంలో ప్రధాన మంత్రి అన్నారు. విద్యారంగంలో ప్రజలు పాల్గొనే పాత్రను విస్తృతపరుస్తూ, బలోపేతం చేయటానికి, నిరంతర అధ్యయనానికి ఇది ఒక సందర్భం మాత్రమే అనీ ఆయన చెప్పారు. భారతదేశంలోని విద్యకోసం అనువాదాన్ని ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక సంస్థ లేక సమితి ఏర్పాటు తక్షణావసరమని ఈ సంఘాధ్యక్షుడు శ్రీ శామ్ పిత్రోడా భావించారు.

సందర్భం
అనువాదమనేది నిరంతరం జరుగుతూ ఉండే ప్రక్రియ నిజమే అయినా, ఈ కీలక రంగంలో ప్రధానంగా దేశ అనువాద కార్యకలాపంలోని అసమగ్రత ఉండటంవల్ల దీనిలో ప్రజల నిర్మాణాత్మకమైన ప్రమేయం కలిగివుండాల్సిన అవసరం ఉంది. ఈ అసమగ్రత అనేది విభిన్న శాఖలు, భాషలకే కాకుండా ప్రమాణాలలోనూ, పంపిణీ, ప్రవేశాలలో కూడా ఉంది, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాలు, అనువర్తిత విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, న్యాయ, వైద్య, కార్యనిర్వాహక, సాంకేతజ్ఞత, తదితర విభిన్నమైన, అభివృద్ధి చెందుతున్న రంగాలలో గుర్తించ లేనటువంటి అనువాద అవసరం ఉంది.

ఇంకా, అనువాదాలద్వారా లభ్యమవుతున్న సమాచారం సరిపోవటం లేదు. అసౌష్టవం కూడా. అనువాదాల వ్యాప్తి కూడా అంత సంతృప్తికరంగా లేదు. ఎందు కంటే, లక్ష్య పాఠకుల విస్తృత వ్యాప్తి, అసమన్వయ స్థితి, విఫణిలోనికి వేళ్ళే అనువాదాలపై అంచనా వేయటం, హామీలు ఇవ్వటం అరుదుగా జరగుతోంది. ప్రామాణిక అనువాదాల వ్యాప్తి మాత్రమే ఒక స్థాయిని కలిగిస్తుంది. అలాగే అనువాద రంగంలో వ్యక్తి గతంగా జరుగుతున్న కార్యకలాపాలకు సరైన ప్రేరణనిస్తుంది. ఈ సందర్భం, సమితి రూపంలో ప్రజా జోక్యం చేసుకోవలసిన అవసరాన్ని ఇస్తోంది. ఇది వివిధ శాఖలలో ఉన్నత ప్రమాణాల అనువాదాల సాధ్యత, అందుబాటుకు, వ్యక్తిగత అనువాద ప్రయత్నాలను ఆరంభించేందుకు తగిన చర్యల రూపేణా ప్రోత్సహించే విధానాన్ని ప్రారంభించవచ్చు. అనువాద కార్యకలాపాలు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలను కూడా కల్పించగలుగుతాయి. ఆ విధంగా ఇది విద్యావంతులైన నిరుద్యోగులు తమకోసం ప్రతిఫలాన్నిచ్చే వృత్తిని ఎంచుకోవటంతోపాటు ప్రజలకు సేవచేసుకునే అవకాశాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

ఈ విధంగా కలిగిన అవగాహనే జాతీయ జ్ఞాన సంఘాన్ని(జా. జ్ఞా. స.) ప్రొ.జయతీ ఘోష్ నేతృత్వంలో కొంత మందితో పని వర్గాన్ని ఏర్పరిచేందుకు ప్రేరేపించింది. తద్వారా అనువాద కార్యకలాపాలలో నిమగ్నమైన విభిన్న సంస్థలు, వ్యక్తులను ఒక చోట చేర్చటమే కాకుండా, దాని ముద్రణకు, వ్యాప్తికి కృషి చేస్తుంది. ఈ పని వర్గంలో సంబంధిత ప్రభుత్వం నుంచి, పాక్షిక ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, భాషా శాస్త్రవేత్తలు, అనువాదకులు, విద్యావేత్తలు, ప్రచురణకర్తలు, ఇంకా భారతదేశంలో అనువాద కార్యకలాపాలతో ముడిపడి వున్న ఇతరులందరూ ఉంటారు. ఈ వర్గాలు కలవటం ఆరంభించి, 2006 ఫిబ్రవరిలో, ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా, ప్రొ. ఉదయ నారాయణ సింగ్ అనువాద రంగానికి సంబంధించిన వివిధ అంశాలను రేఖా మాత్రంగా వివరించారు. 2006 మార్చి 6వ తేదీన జాతీయ అనువాద సమితి సభ్యుడూ సమన్వయకర్త అయిన ప్రొ. జయతీ ఘోష్, జా. జ్ఞా. స. చేసిన సిఫారసులను, సవరించిన ప్రతిపాదనలను ప్రణాళికా సంఘానికి పంపూతూ దాని ఉపాధ్యక్షునికి లేఖ రాశారు. ఆ తరువాత ఈ వర్గాలు అనేక సార్లు కలిసి చర్చించారు. ఇందులో భాగంగా, భారతీయ భాషల కేంద్రీయ సంస్థ. మైసూరులో రెండు రోజుల వర్కు షాపును 2007, ఏప్రిల్ 12-13 తేదీలలో పెద్ద ఎత్తున నిర్వహించారు. 2006, ఏప్రిల్ 19న, ప్రణాళిక సంఘం లేఖ (సంఖ్య: పి 11060/41 2005 – విద్య.) ద్వారా సవరించిన ప్రతిపాదనలపై వ్యాఖ్యానించింది. ఇది లేవనెత్తిన ఐదురకాల ప్రశ్నలకు తగురీతిన జవాబివ్వబడింది. ఈ లోగా సామాజిక శాస్త్ర నిపుణులు, ముఖ్యంగా సమాజాల అభిపృద్ధి అధ్యయన కేంద్రం (స. అ. అ. కేం.), భారతీయ చారిత్రక పరిశోధనా మండలి (భా. చా. ప. మం) వంటి మరికొన్నిఇతర సంస్థల నుంచి సవివరణాత్మక వ్యాఖ్యలను కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలు అనేక అంశాలను లేవనెత్తటంతో పాటు, “జాఅస” పరిధి, నిర్వహణలకు సంబంధించి కొన్ని సృజనాత్మక సలహాలు ఇచ్చాయి. వీటిలో కొన్ని ఈ సవివరణాత్మక పథక నివేదికలో చేర్చబడ్డాయి. 2006 జూన్ 21, జూలై 3న అనువాదంలో నిమగ్నమైన ప్రచురణ కర్తల నుంచి అనేక సలహాలు కూడా వచ్చాయి. ఆ తరువాత, ఆగస్ట్ 31, 2006న మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన భాషలు - పుస్తక ఉన్నతి పనివర్గం కూడా ప్రణాళికా సంఘానికి పంపిన పదకొండవ ప్రణాళికకు చేసిన సిఫారసులలో ఈ ఆలోచనకు ఆమోద ముద్రవేసింది. వెనువెంటనే, 2006, సెప్టెంబరు 1న, జా. జ్ఞా. స. అధ్యక్షుడు శ్రీ శామ్ పిత్రోడా జాఅస వివరాలు తెలుపుతూ ప్రధానమంత్రికి రాశారు. తదనంతరమే, జాఅసను గురించిన వివరణాత్మక ప్రతిపాదనకు మానవ వనరుల మంత్రిత్వశాఖ రూపకల్పన చేసింది.