చర్చనీయంశాలు

శాస్త్రీయ సాంకేతిక పరిభాషా సంఘం (సి.ఎన్.టి.ఎస్.) జాతీయ విద్య మరియు పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్.సి.ఇ.టి.) జాతీయ పుస్తక మండలి (ఎన్.బి.టి.) యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యుజిసి) సాహిత్య అకాడమీ, భారతీయ భాషల కేంద్రీయ సంస్థ (సి.ఐ.ఐ.ఎల్.), మైసూరు, గ్రంథ అకాడెమీలు, (ప్రభుత్వ గ్రంథాలయ అనుసంధానాలవంటి వాటి సహాయ సహకారాలు, సమన్వయం అవసరం. ఇది అతి వ్యాప్తిని, నకిలీలను నివారించటానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా జతకలుపుకోవడం ప్రచురణకర్తలతోను, దినపత్రిక/ మాధ్యమ, సామూహిక సంస్థలతోనూ, పుస్తక అమ్మకందార్లతోనూ అవసరమైయుంది. ఇక్కడ విషయమేమిటంటే, వ్యూహాత్మక మధ్యవర్తిత్వ నిర్మాణం సంయుక్త వాహకాలను ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు/వైయుక్తిక ప్రతినిధులద్వారా అభివృద్ధిపరిచేందుకు వారిని నిమగ్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

జాఅస ద్వారా విపులీకరించి, చర్చించి ప్రధాన అంశాల జాబితా కింద పేర్కొనబడినది:

ఎ. సాంకేతిక శాస్త్రీయ పరిభాష సృజన
బహుభాషాత్వ స్థితి భారతదేశంలో నెలకొని ఉండటంవల్ల విస్తృతమైన అవకాశాన్ని కలిగి ఉంది. తేలికగా ఒక భాషతో నుంచి మరొక భాషలోకి అనువదించవచ్చు .ఇది ఏ రకమైన అధిక్రమాన్ని సృష్టించకుండా తేలికగా అనువదించటానికి కావలసిన సౌకర్యాలను అందించటానికి మనం మార్గాలను అన్వేషిస్తాం.
జ్ఞాన గ్రంథాలనువదించటానికి ఒక తీవ్ర అవసరమేమిటంటే పరిభాష, వాటి ప్రామాణికత, అప్రమాణిక పదజాలాన్ని అనుమతించకపోవటం మరియు అపభాష, వీటితోపాటు భావనా సూత్రీకరణలను కూడా. ఈ విధంగా చేయటంవలన భాషల మధ్య వెసులుబాట కలిగి అనువాదం తేలికవుతుంది. ఇది ప్రధానమైన సమస్యలలో ఒకటి దీనిని జాఅస ద్వారా గురిపెట్టేది.

బి. అనువాదక విద్య
అనువాదమనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ప్రత్యేకమైన శాస్త్రాలను అనువదించవలసిన అంశం తలెత్తినప్పుడు నైపుణ్యం అవసరం అవుతుంది. ఈ సమితి అనువాదకవిద్య పరిధిలో ప్రయత్నం చేస్తుంది. అనువాదక విద్య ద్వారా
1. స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు ప్రత్యేక ఉద్దేశాలతో నిర్వహించటం. ఉదా:- వాఖ్యానం ఉపశీర్షికలు పెట్టడం, న్యాయశాస్త్ర అనువాదం, స్వచ్ఛ విజ్ఞాన శాస్త్రాలు, అనువర్తిత శాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలు మొదలైన వాటికి ఆయా విభాగాలకు చెందిన నిపుణులను పరిశోధకులను నిమగ్న చేసే విధంగా చేస్తుంది.
2. పాఠ్యక్రమ మోడ్యూళ్లు అనువాదకులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవి అనువాదకులు దేశవ్యాప్తంగా ఆయా భాషలతో భాషాబోధనా సామగ్రిలో చేర్చుకొనవలసి ఉంటుంది. లేక సెలవు రోజులలో పని అనంతరం, తరగతి అనంతరం గంటలలో ప్రత్యేక పాఠ్యక్రమాన్ని నడువవలసి ఉంటుంది.పాఠ్యక్రమ మోడ్యూళ్లు అనువాదకులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవి అనువాదకులు దేశవ్యాప్తంగా ఆయా భాషలతో భాషాబోధనా సామగ్రిలో చేర్చుకొనవలసి ఉంటుంది. లేక సెలవు రోజులలో పని అనంతరం, తరగతి అనంతరం గంటలలో ప్రత్యేక పాఠ్యక్రమాన్ని నడువవలసి ఉంటుంది.
3. విశ్వవిద్యాలయాలలోను, సంబంధిత ఇతర సంస్థలలోను అనువాద సాంకేతజ్ఞతలో ప్రత్యేక పాఠ్య క్రమాలు అభివృద్ధిపరచటానికి ప్రోత్సహించి, మద్దత్తునిచ్చి, సహాయపడవలసి ఉంది.
4. పరిశోధన పథకాలను ప్రోత్సహించటం, విద్యార్థుల పరిశోధనలతో కలిపి మంచి గ్రంథాలను ఎంపిక చేసుకోడానికి వాటి ద్వారా మంచి అనువాదాలను అందించటానికి, వనరుల ఉత్పాదనకు ఇంకా బోధనాశాస్త్ర ప్రయోజనాలను తీర్చగలుగుతుంది.
5. భారతీయ భాషల మధ్య ప్రత్యేకంగా అనువాద సంబంధ విషయంలో వివిధ సంస్థలలో పరిశోధనకు ఈ సంస్థ నుంచే పరిశోధనా ఉపకార వేతనాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టవచ్చు.
6. ప్రత్యేక గ్రంథాలను ఎంచుకొనటం, నిపుణులు, శిక్షణ పొందేవారు కలసి సమస్యల్ని చర్చించి, పరిష్కరించే విధంగా చేయటం ముఖ్యంగా జ్ఞాన గ్రంథాల విషయం, పరిభాష, సాంస్కృతిక మరియు భాషా సందర్భాలలోని అంశాలు కలిసి పనిచేసేటట్లు వర్కుషాపులు నిర్వహించటం
7. సంకలనం, ప్రతిపరిష్కృతి, రచన సంబంధిత విషయాలలో వర్కుషాపులు నిర్వహించటం.

సి. సమాచార వ్యాప్తి
ఒకే చోట సమాచారం అందుబాటులో ఉన్నస్థలమే లేకపోవటంవల్ల దేశంలో ఇంకా జ్ఞానానికి సంబంధించి అందుబాటులో ఉన్న అనువాద సామర్థ్యాలు ఇంకా సరిపోవటం లేదు. భాషాఅనువాదకుల విషయంలో ఇది నిజం. అఖిల భారత సమతలం మీద ఇంగ్లిషు అనువాదకులు ఎంతో సంతోషిస్తున్న స్థితి కనిపిస్తుంది

సమితి గ్రంథాల అందుబాటులేని కష్టతర పరిస్థితిని సంబోధించవచ్చు. అందుబాటులో ఉన్న నైపుణ్యాలను కనుగొనేందుకు ఈ కింది మార్గాలు ఉన్నాయి:
1. సమితి గ్రంథాల అందుబాటులేని కష్టతర పరిస్థితిని సంబోధించవచ్చు. అందుబాటులో ఉన్న నైపుణ్యాలను కనుగొనేందుకు ఈ కింది మార్గాలు ఉన్నాయి;
2. ఆన్లైన్లో అన్ని భారతీయభాషలలో అనువాదానికి సంబంధించి లభ్యమవుతున్న వివిధ రచనల ఉపయుక్త గ్రంథసూచిని ఉత్పాదన చేయటం. భారతీయ భాషలలోని రచనలు మరియు విదేశీభాషలలోని రచనలు, శాస్త్రాల, భాషల, పరిశోధన పరిసరాల ఆధారిత శోధన సౌకర్యాలతో ఇంకా ఉపయోగించుకొనువారికి ఉత్పాదకాలను కలిగి ఉండే సౌకర్యాన్ని అందించటం. ಬೇಕು. ఇవి రెండూ కూడా ఎప్పటికప్పుడు చేర్చుకొని అభివృద్ధిపరుస్తూ, విశ్వవిద్యాలయాలు ప్రచురణకర్తలు, జాతీయగ్రంథాలయాలు, అకాడెమీలు, జాతీయ పుస్తకమండలి మరియు శాస్త్రీయ మరియు సాంకేతిక పరిభాష సంఘం సమితితో (సి.ఎస్.టి.టి.) మొదలైన వాటితో అనుసంధానం కల్గి ఉంటుంది.

సాహిత్య అకాడెమీ సాహిత్యంలోని అనువాదాల ఉపయుక్తగ్రంథసూచి జతపర్చింది. ఇది “అనుకృతి” సి.ఐ.ఐ.ఎల్. –వెబ్సైట్లో ఇప్పటికే ఉంది. ఇప్పటికీ అనేకమంది భారతీయభాషల అనువాదకులను చేర్చి, అనువాదకుల జాబితాను సాహిత్య అకాడెమీ అచ్చువేసింది. వీటిని కూడా జాఅస వెబ్సైట్లో పెట్టవలసి ఉంది. ఈ రెండుకూడా ఆధునీకరించి విస్తృతపరచి కొత్తగా గుర్తించిన భారతీయ భాషలను చేర్చుకోవలసి ఉంది. ఇవన్నీ సాహిత్యానికే పరిమితమైయుండటం, అనువాదకుల జాబితాలు మరియు అనువాదాలు ఇంకా ఇతర పరిసరాలలో తాజాగా అభివృద్ధిపరచవలసి ఉంటుంది. దీనికోసం జాఅస సేకరణకర్తలను, సంకలనకర్తలను భారతదేశంలోని వివిధ ప్రాంతాలనుంచి నిమగ్నం చేయవలసి ఉంది.

డి. కనిపిస్తున్నవి మరియు ఆచరణ సామర్థ్యం
అనువాదం అనువాదకులు ఇంకా కనిపించవలసిన అవసరం ఉంది. ఇదికొంత అనువాదకుల వేతన స్థాయిలకు సంబంధించి చేయవలసినది. దీనిని మరోసారి తాజాగా పరిశీలించవలసి ఉంది. ప్రస్తుతం మనం అనువాదాన్ని ఒక వృత్తిగా ఆలోచిస్తున్నట్లే చివరకు భారతదేశంలో కూడా అనువాద పరిశ్రమని ఆలోచించవలసి ఉంది. అనువాదకుల ప్రత్యేక శాస్త్రాలు ఏమైనప్పటికీ అనువాదం ద్వారా గౌరవప్రదమైన జీవన విధానాన్ని కలిగి ఉండేటట్లు చేయవలసి ఉంది.

జాఅసలో వివిధ ప్రాంతాలలో నమోదు చేసుకొన్న అనువాదకుల ద్వారా ఒక యంత్రాంగాన్ని పరిణమింపజేసి గుణ నియంత్రణ కలిగి ఉండటానికి యోగ్యతలను గుర్తించటానికి ఉపకరిస్తుంది. ఆయా శాస్త్రాల నిపుణులు, పరిశోధకులు మూలభాష, లక్ష్యభాషలలో, విశదపరిచే పాఠకులు కలిసి మూల్యాంకన మండళ్లుగా ఏర్పడి అనువాద గుణాన్ని నిగ్గుతేల్చి నిర్ణయించవచ్చు. ఆ అనువాదం జాతీయ సమూహంలో నమోదు చేసుకొని చేర్చదగినంత విలువైనదా, కాదా తేల్చవచ్చు. వారికూడా కొంత లిబ్దిని కలుగజేయవచ్చు. లేకపోయినట్లైతే, యోగ్యతా పత్రాన్ని కూడా ఇవ్వవచ్చు. ఇంకా వారి పేర్లను జాఅస వెబ్సైట్లోనూ ప్రదర్శించవచ్చు.

ఇ. అనువాదప్రచార సాధ్యతకు హామీ
మరికొన్ని ఇతర మార్గాల ద్వారా అనువాదాలు కనిపించేటట్లు చేయటం, అభివృద్ధి పరచటం:
1. అనువాదాల కోసం పుస్తకాలకు ప్రారంభించే కార్యక్రమ నిర్వహణ.
2. అనువాదానికి సంస్థతరపున బహుమానాలు మరియు పరిశోధనా ఉపకార వేతనాలు ఇవ్వటం.
3. ప్రాంతీయ అనువాద పండుగలు నిర్వహించటం, (అనువాద మేళా) చదవటం, చర్చించటం, పుస్తక ప్రదర్శనలు ఆయా పరిసరాలలో అనువాదములను గౌరవించటం.
4. విలువైన అనువాదాలను కొనుగోలు కలిగి ఉండేటట్లుగా చూడటానికి గ్రంథాలయాలలోనూ సంధానత కలిగి ఉండాలి.
5. జాఅస - నిధుల సహాయ పథకం ద్వారా తిరిగి కొనుగోలు ఒప్పందాన్ని అనువాదకులు, రచయితలు ప్రచురణ కర్తల నుండి పొందాలి
6. జాతీయ అనువాద సమితి - నిధుల సహాయ పథకం ద్వారా అనువాదములను ప్రచురణ సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించి అనువాద ప్రక్రియను ప్రోత్సహించటం
7. అనువదించిన శాస్త్రీయ బోధనా సామగ్రిని దిగుమతి చేసుకునే సౌకర్యం కలిగించటం వివృత వనరుల సైటు లేక ప్రచురణకర్తల నుండి నామమాత్రపు ఖరీదులకు కొనుగోలుద్వారా లేక ఉచితంగా దిగుమతి చేసుకొనివ్వటాన్ని ఇంకా నిర్ణయించవలసి ఉంది.
8. అనువాదకులకు విశ్వవిద్యాలయ శాఖలకు మధ్య ఇంటర్ఫేస్ తయారు చేయటం, అనువాదాలలో ప్రత్యేక పరిశోధన శాఖలను అందించటం, విరివిగా అనువాదాలను అందించాలని ఇష్టపడుతున్న ప్రచురణకర్తల, ప్రభుత్వ, వైయుక్తిక రంగాలకి, అనువాద కొనుగోలుదార్లకి, అనువాద వినియోగదార్లుకు అందించాలి.
9. ఇంగ్లిషు మరియు భారతీయ భాషలలోనూ పత్రికలను అనువాద దృకోణంలో అచ్చువేసుకోడానికి నిధుల సహాయ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించటం లేక ఏయే పత్రికలోనైనా అనువాద సంబంధ విషయాలు కల్గివున్నాయో వాటి ఈ-భావం తీసుకొని రావటానికి లేక అచ్చువేయటానికి, ముద్రణలో ఉన్నవి, వివిధ వృత్తి పత్రికలను లేక వైవిధ్యభరిత శాస్త్రాలలో ఇంగ్లిషు మరియు ప్రాంతీయ భాషలలో ధారావాహిక ప్రచురణలకు సహాయపడటం
10. అనువదించిన సామగ్రిని పాఠశాలల కళాశాలల విశ్వవిద్యాలయ ప్రాంతీయ, జాతీయ పాఠ్యక్రమ చట్రాలలో పెట్టుకొనేటట్లుగా సలహాలివ్వటం, నచ్చజెప్పటం
11. భాషావనరుల కేంద్రాలను స్థాపించటానికి సహాయపడటం, పుస్తకశాలలకు బాహ్య పుస్తకశాలలను అనువాద గ్రంథాలయాలకు సంబంధించి పనిచేస్తున్నవాటిని అన్ని స్థాయిలలో అన్ని విద్యా సంస్థలలో ఉండేటట్లు చూడటం.
12. ద్విభాషా/బహుభాషా నైపుణ్యాలను, ప్రావీణ్యతను ప్రదర్శించటం. అది ఏయే పరిసరాలలో ఉపయోగపడుతుందో గ్రహించటం దాని అనువర్తన, పరీక్ష మరియు ఉద్యోగ పోటీ పరీక్షలతో కలిపి ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని ప్రాముఖ్యతను తెలియజేయటం ఉపయోగపడుతుంది
13. ప్రభుత్వ - పౌర సరఫరాల సంస్థలతో జతకలుపుకొని అనువదించిన సామగ్రికి పట్టణాలలోను, గ్రామీణ భారతావనిలోను విస్తృతమైన వెసులుబాటు కలుగజేయటం.